బిగ్‌బాస్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు బిగ్‌బాస్ కూడా మంచి ప్రేక్షకాదరణతో దూసుకుపోతున్నది. అయితే బిగ్‌బాస్- 5 సీజన్‌కు ఈ సారి రానా హోస్ట్‌గా రాబోతున్నాడని వార్తలు వినిపించాయి. బిగ్‌బాస్ 3, 4 సీజన్లలో అక్కినేని నాగార్జున హోస్ట్‌గా చేసిన విషయం తెలిసిందే. సీజన్ 5లో నాగార్జునే హోస్ట్ చేస్తాడని వార్తలు వినిపించాయి. కానీ బిజీ షెడ్యూల్, డేట్స్ కుదరకపోవడంతో నాగార్జున ఒప్పుకోలేదు. దీంతో రానాను బిగ్‌బాస్ నిర్వాహకులు సంప్రదించారట. అయితే తాజాగా రానా కూడా నో చెప్పినట్టు సమాచారం.
టీవీ ప్రేక్షకులకు రానా సుపరిచితుడే. ఇప్పటికే పలు టీవీ షోలు చేసి మెప్పించాడు. దీంతో రానా బిగ్‌బాస్ హోస్ట్‌గా చేస్తాడని వార్తలు వినిపించాయి. రానా దగ్గుపాటి తన చిత్రాల ఎంపిక, పాత్రల ఎంపికలో ఎంతో వైవిధ్యాన్ని కనబరుస్తూ ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలో నంబర్ వన్ యారీ వంటి టీవీ షోలు కూడా చేశాడు. దీంతో రానా బిగ్‌బాస్- 5కి హోస్ట్ చేస్తాడంటే బిగ్‌బాస్ ఫ్యాన్స్ సంతోషించారు. కానీ రానా బిగ్ బాస్‌లో హోస్ట్‌గా చేసేందుకు నో చెప్పినట్టు టాక్. ప్రస్తుతం బిగ్‌బాస్ సెట్ వేస్తున్నారు. ఇక కంటెస్టెంట్లను కూడా ఎంపిక చేస్తున్నారు.
ఈ మేరకు ఇప్పటికే పలువురు యూట్యూబ్ స్టార్స్, సీరియల్ ఆర్టిస్టులకు ఫోన్ లు వెళ్తున్నాయి. మొత్తానికి తెర వెనక అప్పుడే బిగ్ బాస్ హడావుడి మొదలైంది. సెప్టెంబర్‌లో ఈ షో ప్రారంభమయ్యే చాన్స్ ఉంది. ప్రస్తుతం రానా కూడా షూటింగ్స్‌తో బిజిగా ఉన్నాడు. ఈ క్రమంలో ఈ షోలో చేసేందుకు నో చెప్పాడని సమాచారం. నిజానికి గతంలోనే బిగ్‌బాస్ షోతో రానా రెమ్యూనరేషన్ కూడా మాట్లాడుకున్నట్టు వార్తలు వచ్చాయి. రానా చెప్పిన పెద్ద అమౌంట్‌కు బిగ్‌బాస్ నిర్వాహకులు ఒప్పకున్నట్టు కూడా గుసగుసలు వినిపించాయి. చివరకు ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు.. మొత్తానికి రానా నో చెప్పాడు.
Also Read