Saturday, April 27, 2024
- Advertisement -

Naga Chaitanya : లాల్ సింగ్ సెట్స్ లో చైతూ..!

- Advertisement -

యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ఎప్పుడూ లేని విధంగా వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన లవ్ స్టోరీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. థియేటర్లు లో ఓపెన్ అయిన తర్వాత విడుదలయ్యే మొదటి సినిమా కూడా ఇదే. దీంతోపాటు చైతూ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కూడా నటిస్తున్నారు. నాగచైతన్య బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న లాల్ సింగ్ చద్దాలో ఓ కీలక పాత్రలో నాగచైతన్య నటిస్తున్నాడు.

నాగచైతన్య హిందీ మూవీ లో నటించడం ఇదే తొలిసారి. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకు జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా తాజా షెడ్యూల్ లద్దాక్ లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో నాగచైతన్య అమీర్ ఖాన్ పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అమీర్ ఖాన్ సైన్యంలో పనిచేసే సమయంలో ఆయన మిత్రుడు పాత్రలో నాగచైతన్య కనిపించనున్నారు. సుమారు 20 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది.

అమీర్ ఖాన్ నాగచైతన్యపై యుద్ధ ఘట్టాలను తెరకెక్కించనున్నారు. లాల్ సింగ్ చద్దా హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ కు రీమేక్. ఇందులో అమీర్ ఖాన్ సరసన కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు అగ్రహీరోలు అందరూ పాన్ ఇండియా సినిమాలతో బాలీవుడ్ లో అడుగు పెడుతుండగా, నాగచైతన్య నేరుగా హిందీ సినిమాలో నటిస్తూ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు.

Also Read

బాలుడిని కాపాడిన విజిల్​ సినిమా.. విషయం ఏమిటంటే?

బాప్ రే…వెయ్యి మందితో లైగర్ క్లైమాక్స్ సీన్..!

ద్దరు యంగ్ హీరోల సినిమాల్లో బేబమ్మకు ఛాన్స్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -