Thursday, April 25, 2024
- Advertisement -

Bigg Boss 5: బిగ్ బాస్​ హోస్ట్​గా చేసేందుకు నో చెప్పిన రానా..!

- Advertisement -

బిగ్​బాస్​కు ఎంత క్రేజ్​ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు బిగ్​బాస్​ కూడా మంచి ప్రేక్షకాదరణతో దూసుకుపోతున్నది. అయితే బిగ్​బాస్​- 5 సీజన్​కు ఈ సారి రానా హోస్ట్​గా రాబోతున్నాడని వార్తలు వినిపించాయి. బిగ్​బాస్​ 3, 4 సీజన్​లలో అక్కినేని నాగార్జున హోస్ట్​గా చేసిన విషయం తెలిసిందే. సీజన్​ 5లో నాగార్జునే హోస్ట్​ చేస్తాడని వార్తలు వినిపించాయి. కానీ బిజీ షెడ్యూల్​, డేట్స్​ కుదరకపోవడంతో నాగార్జున ఒప్పుకోలేదు. దీంతో రానాను బిగ్​బాస్​ నిర్వాహకులు సంప్రదించారట. అయితే తాజాగా రానా కూడా నో చెప్పినట్టు సమాచారం.

టీవీ ప్రేక్షకులకు రానా సుపరిచితుడే. ఇప్పటికే పలు టీవీ షోలు చేసి మెప్పించాడు. దీంతో రానా బిగ్​బాస్​ హోస్ట్​గా చేస్తాడని వార్తలు వినిపించాయి. రానా దగ్గుపాటి తన చిత్రాల ఎంపిక, పాత్రల ఎంపికలో ఎంతో వైవిధ్యాన్ని కనబరుస్తూ ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలో నంబర్​ వన్​ యారీ వంటి టీవీ షోలు కూడా చేశాడు. దీంతో రానా బిగ్​బాస్​- 5కి హోస్ట్​ చేస్తాడంటే బిగ్​బాస్​ ఫ్యాన్స్​ సంతోషించారు. కానీ రానా బిగ్ బాస్​లో హోస్ట్​గా చేసేందుకు నో చెప్పినట్టు టాక్​. ప్రస్తుతం బిగ్​బాస్​ సెట్​ వేస్తున్నారు. ఇక కంటెస్టెంట్లను కూడా ఎంపిక చేస్తున్నారు.

ఈ మేరకు ఇప్పటికే పలువురు యూట్యూబ్ స్టార్స్​, సీరియల్​ ఆర్టిస్టులకు ఫోన్​ లు వెళ్తున్నాయి. మొత్తానికి తెర వెనక అప్పుడే బిగ్ బాస్​ హడావుడి మొదలైంది. సెప్టెంబర్​లో ఈ షో ప్రారంభమయ్యే చాన్స్​ ఉంది. ప్రస్తుతం రానా కూడా షూటింగ్స్​తో బిజిగా ఉన్నాడు. ఈ క్రమంలో ఈ షోలో చేసేందుకు నో చెప్పాడని సమాచారం. నిజానికి గతంలోనే బిగ్​బాస్​ షోతో రానా రెమ్యూనరేషన్​ కూడా మాట్లాడుకున్నట్టు వార్తలు వచ్చాయి. రానా చెప్పిన పెద్ద అమౌంట్​కు బిగ్​బాస్​ నిర్వాహకులు ఒప్పకున్నట్టు కూడా గుసగుసలు వినిపించాయి. చివరకు ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు.. మొత్తానికి రానా నో చెప్పాడు.

Also Read

మా ఎన్నికలు: ప్రకాష్ రాజ్​ కు గట్టిగా బదులిచ్చిన నరేశ్​..!

బాలుడిని కాపాడిన విజిల్​ సినిమా.. విషయం ఏమిటంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -