Friday, April 19, 2024
- Advertisement -

ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే ‘సౌత్ ఇండస్ట్రీయే’..!

- Advertisement -

ఒకప్పుడు భారీ సినిమాలు నిర్మించే ఇండస్ట్రీ అన్నా, అంతర్జాతీయ స్థాయిలో వేలాది థియేటర్లలో విడుదలయ్యే సినిమాలన్న గుర్తుకు వచ్చేది బాలీవుడ్డే. అప్పుడు పాన్ ఇండియా స్థాయి సినిమాలు నిర్మించేది బాలీవుడ్ మాత్రమే. అయితే ఇప్పుడు భారీ చిత్రాల నిర్మాణంలో బాలీవుడ్ వెనుక పడిపోతోంది. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయి సినిమాల నిర్మాణం సౌత్ లోనే ఎక్కువగా జరుగుతోంది. బాహుబలి మూవీ తర్వాత ముఖ్యంగా తెలుగులో భారీ స్థాయి చిత్రాల నిర్మాణం భారీగా జరుగుతోంది.

అలాగే కన్నడలో కేజీఎఫ్ మూవీ తర్వాత అక్కడ కూడా భారీ సినిమాలను నిర్మిస్తున్నారు. ఇక కోలీవుడ్ లో పొన్నియన్ సెల్వం వంటి భారీ సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. దీంతో ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే అంతా సౌత్ వైపే చూస్తున్నారు. దేశంలో అత్యంత అవైటెడ్ మూవీస్ కూడా సౌత్ నుంచి వచ్చేవి కావడం గమనార్హం. టాలీవుడ్ లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ రూ.350 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోంది. ఈ సినిమా కేవలం డిజిటల్, శాటిలైట్ రైట్స్ ద్వారానే రూ. 350 కోట్ల దాకా ఆదాయం తెచ్చుకుంది. థియేట్రికల్ రైట్స్ తో కలిపి ఈ సినిమా బిజినెస్ రూ.800 కోట్లు దాటుతోంది.

ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ మూవీ కూడా భారీగా బిజినెస్ చేస్తోంది. ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ రూ.500 కోట్లకు పైగానే పలికినట్లు సమాచారం. ఇక కన్నడలో రూపుదిద్దుకుంటున్న కేజీఎఫ్ -2 సినిమా పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా కళ్లుచెదిరే విధంగా బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం. తమిళంలో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొన్నియన్ సెల్వం సినిమా కూడా భారీగా బిజినెస్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక మలయాళంలో మోహన్ లాల్ నటిస్తున్న సినిమాలకు దేశవ్యాప్తంగా ఆదరణ దక్కుతోంది. కోలీవుడ్లో విజయ్ హీరోగా నటిస్తున్న బీస్ట్ పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇలా బాలీవుడ్ తో పోలిస్తే సౌత్ సినీ ఇండస్ట్రీలో నిర్మాణం అవుతున్న సినిమాలు భారీగా బిజినెస్ చేస్తున్నాయి. అలాగే పాన్ ఇండియా స్థాయి సినిమాలు కూడా రూపుదిద్దుకుంటున్నాయి. బాలీవుడ్లో ఈ స్థాయిలో సినిమాల నిర్మాణం జరగడం లేదు. బిజినెస్ కూడా ఆ రేంజ్ లో ఉండటం లేదు. దీన్ని బట్టి మున్ముందు కాలం బాలీవుడ్ సౌత్ ఇండస్ట్రీ తో పోలిస్తే మరింత వెనుకబడే అవకాశం కనిపిస్తోంది. ఇండియన్ సినిమా అంటే సౌత్ ఇండస్ట్రీయే అని చెప్పే రోజులు రానున్నాయి.

Also Read

జనాలు ఓటీటీలకు అలవాటయ్యారా?

ఏ హీరోలకు తగ్గేదేలా అంటున్న బన్నీ..!

చిన్నోడు, పెద్దోడు.. వీళ్ల అసలు పేర్లు ఇవే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -