Wednesday, May 1, 2024
- Advertisement -

బాలుడిని కాపాడిన విజిల్​ సినిమా.. విషయం ఏమిటంటే?

- Advertisement -

పదేళ్ల కుర్రాడికి ఆరోగ్య సమస్య వచ్చింది. దీంతో తల్లి దండ్రులు పిల్లాడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే సర్జరీ చేయించుకోకుండా పిల్లాడు మారాం చేస్తున్నాడు. కనీసం మత్తు ఇంజెక్షన్​ కూడా తీసుకోవడం లేదు. అయితే డాక్టర్లకు ఏం చేయాలో పాలు పోలేదు. అయితే వాళ్లకు ఓ విషయం తెలిసిందే. ఆ కుర్రాడు.. తమిళ స్టార్​ హీరో, ఇళయదలపతికి పెద్ద అభిమాని. దీంతో అక్కడ ఉన్న ఓ డాక్టర్​ తన మొబైల్​లో బిగిల్​ ( విజిల్​) సినిమాను చూపించాడు.

దీంతో ఆ కుర్రాడు సినిమా చూస్తూ చుట్టూ ఏం జరుగుతుందో కూడా మరిచిపోయాడు. వెంటనే డాక్టర్లు ఆ కుర్రాడికి మత్తు ఇంజెక్షన్​ ఇచ్చి చికిత్స ప్రారంభించారు. తమిళనాడులోని చెన్నైలో జరిగిందీ ఘటన. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త తమిళ మీడియాలో వైరల్​ అవుతున్నది.

హీరో విజయ్​ ఫ్యాన్స్​ ఈ వార్తను వైరల్​ చేస్తున్నారు. సదరు డాక్టర్​ను అంతా ప్రశంసిస్తున్నారు. సాధారణంగా తమిళనాడులో హీరోలకు ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఓ రేంజ్​లో ఉంటుంది. అందుకు ఈ ఘటన అద్దం పడుతోంది. పదేళ్ల కుర్రాడు కేవలం తన అభిమాన హీరో సినిమా చూస్తూ.. ఇంజెక్షన్​ తీసుకోవడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. సదరు డాక్టర్​ సమయస్ఫూర్తిని కూడా అంతా మెచ్చుకుంటున్నారు.

Also Read

తెరపైకి వచ్చే మొదటి సినిమా నాగ చైతన్యదే..!

పవర్​స్టార్​ ​​- హరీశ్​శంకర్​​ మూవీ సబ్జెక్ట్​ ఇదే?

రజనీ నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -