Wednesday, May 1, 2024
- Advertisement -

బండ్ల గణేశ్​.. పవర్​స్టార్​ మూవీ టైటిల్​ ఇదేనా? ఫ్యాన్స్​ డిమాండ్​

- Advertisement -

చిన్న ఆర్టిస్ట్​గా మొదలై స్టార్​ ప్రొడ్యూసర్​గా ఎదిగాడు బండ్ల గణేశ్​. పరమేశ్వరా ఆర్ట్స్ ప్రొడక్షన్ పెట్టి ఎన్నో భారీ చిత్రాలను నిర్మించాడు బండ్ల గణేశ్​. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి అక్కడ కూడా ఎంతో వివాదాస్పదం అయ్యాడు. ఇదిలా ఉంటే బండ్ల గణేశ్​ పవర్​స్టార్​కు వీరాభిమాని. ప్రతి ఆడియో ఫంక్షన్​లో, ఇంటర్వ్యూలో సందర్భంగా వచ్చిన ప్రతిసారి పవన్​ కల్యాణ్​ను ఆకాశానికి ఎత్తేస్తుంటాడు బండ్ల గణేశ్​.

ఇటీవల వకీల్​ సాబ్​ ప్రీ రిలీజ్​ ఫంక్షన్​లోనూ పవన్​ కల్యాణ్​ను పొగడ్తలతో ముంచెత్తాడు. ఈ టైంలోనే పవన్​ కల్యాణ్​ తన దేవర అంటూ సంబోధించాడు. టెంపర్​ చిత్రం తర్వాత బండ్ల గణేశ్​ సినిమాలకు కొంచెం బ్రేక్​ ఇచ్చాడు. అయితే ఇటీవల త్వరలోనే పవన్​ కల్యాణ్​తో ఓ మూవీ తీస్తానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బండ్ల గణేశ్​ తీయబోయే కొత్త సినిమాకు ‘దేవర’ టైటిల్​ను పరిశీలించాలని ఫ్యాన్స్​ కోరుతున్నారు. ఈ మేరకు బండ్ల గణేశ్​కు ట్విట్టర్​లో రిక్వెస్ట్​లు హోరెత్తుతున్నాయి.

Also Read: ఆ ఇద్దరు హీరోల రేంజ్ ఎక్కడికో.. !

పవన్​ కల్యాణ్​తో తీయబోయే సినిమాకు దేవర టైటిల్​ను ఫిక్స్​ చేయాలని కోరారట. దీనికి బండ్ల గణేశ్​ కూడా ఓకే అన్నట్టుగా థంబ్స్​ఆప్​ సింబల్​తో రిప్లై ఇచ్చాడు. దీంతో ఈ టైటిల్​ ఫైనల్​ అయినట్టు పవన్​ ఫ్యాన్స్​ చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం పవన్​ కల్యాణ్​ హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్​ కోషియమ్​ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఆ తర్వాత గబ్బర్ సింగ్ కాంబినేషన్ లో మరో చిత్రం ఉంది. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత బండ్ల గణేశ్​తో మూవీకి పవన్ చాన్స్​ ఇచ్చే ఉంది.

Also Read:అన్నా మీ నంబర్​ ఇవ్వండి.. తేజ్​ ఫన్నీ ఆన్సర్​..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -