ఆ ఇద్దరు హీరోల రేంజ్ ఎక్కడికో.. !

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సుమారు రూ.400 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. రాజమౌళి సినిమాలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమాలో నటించే హీరోలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తోంది.

బాహుబలిలో నటించిన ప్రభాస్ అంతర్జాతీయ హీరోగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయి సినిమాలే. బాహుబలితో ప్రభాస్ మార్కెట్ పెరగడంతో ఎంత బడ్జెట్ అయినా పెట్టేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి నుంచి వస్తున్న ఆర్ఆర్ఆర్ దసరా కానుకగా విడుదల అవుతోంది. ఈ సినిమాను కూడా ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల చేస్తున్నారు.

- Advertisement -

Also Read: మరో ప్రయోగానికి సిద్ధమైన కమల్..!

ఈ సినిమా విడుదలైతే ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు కూడా భారీగా మార్కెట్ పెరిగే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్టీఆర్, చరణ్ తమ తదుపరి సినిమాలను భారీ బడ్జెట్ తో తెరకెక్కేలా చూసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ అనంతరం చరణ్ భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. పాన్ ఇండియా కేటగిరీలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దిల్ రాజు రూ. 200 కోట్ల బడ్జెట్ పైనే పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇక శంకర్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన దర్శకత్వంలో వచ్చే ప్రతి సినిమా భారీ సినిమానే.

ఇక ఎన్టీఆర్ తన తర్వాతి సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమా కూడా రూ. 200 కోట్ల బడ్జెట్ తో నిర్మించేందుకు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కు మార్కెట్ కు పెరుగుతుంది కాబట్టి అందుకు అనుగుణంగా ఖర్చు పెట్టేందుకు కొరటాల శివ సిద్ధమవుతున్నట్లు సమాచారం. యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ పై సుధాకర్ మిక్కిలినేని ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. నందమూరి కళ్యాణ్ రామ్ కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తారని సమాచారం.

Also Read: అల్లూ ఫ్యాన్స్.. వెయిటింగ్ అక్కర్లేదు.. పుష్పరాజ్ వచ్చేది ఈ ఏడాదే..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -