అన్నా మీ నంబర్​ ఇవ్వండి.. తేజ్​ ఫన్నీ ఆన్సర్​..!

- Advertisement -

ఇటీవల ప్రముఖ నటులంతా సోషల్​ మీడియాలో యాక్టివ్​ గా ఉంటున్న విషయం తెలిసిందే. అంతేకాక అభిమానులతో కూడా లైవ్​ చాట్​ చేస్తున్నారు. రీసెంట్​గా మెగా హీరో సాయి ధరమ్​ తేజ్​.. తన ఫ్యాన్స్​తో ఇన్​స్టాలో క్వశ్చన్​ అండ్​ ఆన్సర్​ సెషన్​ నిర్వహించాడు. లైవ్​లోకి వచ్చిన ఆయన ఫ్యాన్స్​ పలు ప్రశ్నలు సందించారు. చిరంజీవి, పవన్​ కల్యాణ్​ తనకు గురువులని.. వాళ్లే తనకు ప్రేరణ కలిగించారని సాయిధరమ్​ తేజ్​ చెప్పుకొచ్చాడు. తాను నాగబాబు నుంచే నవ్వడం నేర్చుకున్నానని చెప్పాడు. ఇటీవల సెలబ్రిటీలంతా నిత్యం తమ అభిమానులతో అన్ని విషయాలు పంచుకుంటున్నారు. వాళ్లకు సోషల్ మీడియా మంచి వేదికగా మారింది.

ఇక ఫ్యాన్స్​ కూడా లేటెస్ట్​ అప్​డేట్స్​ కోసం మీడియాను ఆశ్రయించకుండా.. నేరుగా తమ అభిమాన నటులు, డైరెక్టర్ల సోషల్​ మీడియా ఖాతాలను పంచుకుంటున్నారు. ఇక సోషల్​ మీడియాలో లైవ్​ లు నిర్వహించడం.. అభిమానులతో నేరుగా ముచ్చటించడం కూడా కామన్​ అయిపోయింది. అప్పుడప్పుడు కొందరు తింగరి నెటిజన్లు తిక్క తిక్క ప్రశ్నలు అడుగుతూ నటులను ఇబ్బంది పెడుతుంటారు. గతంలో ఓ నెటిజన్​ పూజాహెగ్డేను న్యూడ్​ పిక్​ పంపించాలని కోరాడు. దీనికి ఆమె తన కాలును పిక్​ తీసి పంపించింది. అంతా మెచ్చుకున్నారు.

- Advertisement -

Also Read: మరోసారి ఎన్టీఆర్ తో పూజా హెగ్డే రొమాన్స్ ..!

ఇదిలా ఉంటే తాజాగా సాయిధరమ్​ తేజ్​ను ఓ ఫ్యాన్​.. ’ అన్నా నేను మీ ఫ్యాన్​. మీ మొబైల్​ నంబర్​ ఇవ్వండి’ అంటూ అడిగాడు. దీనికి సాయిధరమ్​ తేజ్​ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. ‘నేను నీకు మొబైల్​ నంబర్​ ఇస్తే.. శివమణి చిత్రంలో ఎమ్ఎస్​ నారాయణ లా అయిపోతుంది నా పరిస్థితి అన్నట్టుగా ఆ సినిమాలోని పిక్స్​ పంపించాడు. ఇక సాయిధరమ్​ తేజ్​ సమయస్ఫూర్తికి చమత్కారానికి అంతా మెచ్చుకుంటున్నారు.

Also Read: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. రాధే శ్యామ్ తాజా అప్డేట్ ఏమిటంటే ..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -