బజరంగీ బాయ్​జాన్​ 2 వచ్చేస్తోందా?

- Advertisement -

2015లో విడుదలైన బజరంగీ బాయిజాన్​ ఎంతటి సంచలన విజయాన్ని నమోదుచేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం ఇండియా, పాకిస్థాన్​ మధ్య ఓ సున్నితమైన కథాంశంతో తెరకెక్కింది. ప్రముఖ కథా రచయిత విజయేంద్రప్రసాద్​ ఈ మూవీకి కథ అందించాడు. అయితే తాజాగా ఈ మూవీకి సీక్వెల్​ రూపొందబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్​ మీడియాలో ఇందుకు సంబంధించిన వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాకు పార్ట్​ 1కు కథను అందించిన విజయేంద్రప్రసాద్​.. సీక్వెల్​కు కూడా కథను సమకూర్చాడట. ఇప్పటికే ఈ సినిమా కోసం కథను తయారుచేసి సల్మాన్​ ఖాన్​కు వినిపించాడట. ఆయనకు ఈ కథ ఎంతగానో నచ్చిందని టాక్​. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

Also Read: ‘అలవైకుంఠపురములో ’ హిందీ రీమేక్​లో అల్లు అర్జున్​ గెస్ట్ రోల్​..!

ప్రస్తుతం విజయేంద్రప్రసాద్​ ఆర్​ఆర్​ఆర్​ కోసం పనిచేస్తున్నాడు. మరోవైపు పలు బాలీవుడ్​, కోలివుడ్​ చిత్రాలకు ఆయన కథలను అందిస్తున్నారు. బాహుబలి పాన్​ ఇండియా స్థాయిలో హిట్​ కావడంతో విజయేంద్ర ప్రసాద్​ పాన్​ ఇండియా రైటర్​గా మారిపోయాడు. ఆయన కథల కోసం దేశవ్యాప్తంగా ప్రముఖ దర్శకులు, నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బజరంగీ బాయిజాన్​ కూడా మరో విభిన్న కథాంశంతో తెరకెక్కబోతున్నట్టు టాక్​.

Also Read: మరోసారి ఎన్టీఆర్ తో పూజా హెగ్డే రొమాన్స్ ..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -