Friday, April 26, 2024
- Advertisement -

రైతన్న కడుపుకొట్టిన ఎలుకలు..! నోట్ల కట్టలు కొరికేశాయి..!

- Advertisement -

రైతు ఎంతో కష్టపడి పండించుకున్న ధాన్యాన్ని ఎలుకలు నాశనం చేయడం మనం ఎన్నో సార్లు వినే వింటాం. ఎలుకల నుంచి రక్షణకు రైతులు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా ఎలుకలు ఓ రైతును రోడ్డున పడేశాయి. అయితే ఈ సారి ధాన్యాన్ని తిని కాదు.. రైతన్న అప్పు చేసి తన వైద్యం కోసం దాచుకున్న డబ్బును కొరికి పడేశాయి. ఈ డబ్బును తీసుకొని రైతు బ్యాంకుకు వెళ్లగా.. అవి చెల్లవని చెప్పారు. రిజర్వ్​ బ్యాంక్​కు వెళ్లి ప్రయత్నించాలని సూచించారు.

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రం శివారు ఇంద్రనగర్‌ కాలనీకి చెందిన భూక్యా రెడ్యా అనే రైతు కూరగాయలను పండిస్తూ వాటిని విక్రయిస్తుంటాడు. ఇటీవల అతడికి అనారోగ్యం కలిగింది. పరీక్షలు చేయించుకోగా.. కడుపులో కణతి ఏర్పడిందని .. సర్జరీ చేసి తొలగించాలని డాక్టర్లు చెప్పారు. దీంతో సర్జరీ, వ్యవసాయ పెట్టుబడి కోసం భూక్యా రెడ్యా రూ. 2 లక్షలు అప్పుచేశాడు. అప్పటికే అతడు దాచుకున్న డబ్బులు రూ. 50 వేలను వాటితో కలిపి బీరువాలో దాచుకున్నాడు. అయితే అతడు దాచుకున్న డబ్బులను ఎలుకలు కొరికిపడేశాయి. దీంతో ఏం చేయాలో అర్థం కాక రెడ్యా బ్యాంకుకు వెళ్లగా.. తాము ఏం చేయలేమని.. హైదరాబాద్​కు వెళ్లి రిజర్వ్​ బ్యాంక్​లో చూపించాలని బ్యాంకు అధికారులు సూచించారు.

Also Read: చిరుత వర్సెస్​ కుందేలు.. మధ్యలో అడవిపంది.. ఈ సీన్​ మామూలుగా లేదు..!

ఇందుకు సంబంధించిన వార్త మీడియా, సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఈ విషయంపై రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్​ స్పందించారు. భూక్యా రెడ్యాకు అన్ని విధాలా సాయం చేస్తామని.. అతడి చికిత్స విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని.. డబ్బులు తిరిగి వచ్చేందుకు అధికారులతో మాట్లాడతామని ఆమె హామీ ఇచ్చారు.

Also Read: థర్డ్​వేవ్​ తప్పదు.. ఐఎంఏ కీలక ప్రకటన

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -