- Advertisement -

భీమ్లానాయక్ విడుదల తేదీ ఖరారు

- Advertisement -

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భీమ్లానాయక్ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమా మరోసారి వాయిదా పడుతుందన్న ప్రచారానికి చిత్ర బృందం బ్రేక్ చెప్పింది. ఊహించని రీతిలో ఫిబ్రవరి 25నే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించాయి. వరుణ్‌తేజ్‌ ‘గని’ విడుదల తేదీ మంగళవారమే ఖరారు కావడంతో, ‘భీమ్లానాయక్‌’ ఆలస్యంగా విడుదల కావొచ్చని అనుకున్నారంతా.

భీమ్లానాయక్‌ విడుదలను ఏప్రిల్‌కు వాయిదా వేస్తారంటూ ప్రచారం కూడా జరిగింది. కానీ అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ‘భీమ్లా నాయక్‌’ విడుదల తేదీని ప్రకటించారు. పవన్‌కల్యాణ్‌, రానా కథానాయకులుగా నటించిన చిత్రమిది. మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’కి రీమేక్‌గా ఈ సినిమాను రూపొందించారు.

సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహించగా… త్రివిక్రమ్‌ రచన చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. నిత్యమేనన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలు. తమన్‌ స్వరాలు సమకూర్చారు.

స్పైసీగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్న మ‌ల్లు బ్యూటీ

తెలుగులో హీరోగా పుష్ఫ నటుడు

భారీ ఆఫ‌ర్ ద‌క్కించుకున్న శ్రీలీల‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -