Wednesday, April 24, 2024
- Advertisement -

లాల్ సింగ్ చ‌ద్దా కోసం ఆదిపురుష్ వాయిదా

- Advertisement -

బాలీవుడ్ న‌టుడు ఆమిర్ ఖాన్, టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య కలిసి నటించిన చిత్రం లాల్ సింగ్ చ‌ద్దా. ఈ చిత్రం విడుద‌ల డేట్ ను మేక‌ర్స్ మార్చారు. ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాను ముందు ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. కానీ, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 11న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

అయితే అదే రోజు పాన్ ఇడియన్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ విడుద‌ల కావాల్సి ఉంది. అయితే లాల్ సింగ్ చ‌ద్దా కోసం ఆదిపురుష్ చిత్రాన్ని వాయిదా వేయ‌డం విశేషం. ఈ విషయాన్ని తాజాగా ఆమిర్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘ఆదిపురుష్’ సినిమాను వాయిదా వేస్తున్న దర్శక – నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అమీర్‌ఖాన్ పోస్టు పెట్టారు.

దీంతో ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాకి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడుగా, కృతి సనన్ సీతగా కనిపించబోతున్నారు. సైఫ్ అలీఖాన్ రావణ్ పాత్రలో సన్నీ సింగ్ లక్ష్మణుడుగా నటిస్తున్నారు. ఇక ఇది ప్రభాస్ మొదటి స్ట్రైట్ హిందీ సినిమా కావడం విశేషం.

హాట్‌ టాపిక్‌గా మారుతున్న సెలబ్రిటీల బ్రేక్‌అప్‌లు

మ‌ళ్లీ కౌబాయ్ గా మహేశ్ ?

మహేశ్ బాబు తల్లిగా అలనాటి స్టార్ హీరోయిన్ రీఎంట్రీ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -