Sunday, May 5, 2024
- Advertisement -

కేతికా శర్మ ఆశలన్నీ ఆ సినిమాపైనే..

- Advertisement -

యంగ్ హీరోయిన్ కేతికా శర్మ ఆశలన్నీ ఇప్పుడు ‘రంగ రంగ వైభవంగా’ చిత్రం మీదే పెట్టుకుంది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు గిరీషాయ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ ఎల్ పీ పతాకంపై బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

డైరెక్టర్ పూరిజగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన ‘రొమాంటిక్’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది యంగ్ బ్యూటీ కేతిక శర్మ. ఈ సినిమాలో ఘాటు అందాలను ప్రదర్శించి బాగానే ఆకట్టుకుంది. అయితే, భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ సినిమాల లిస్ట్‌లో చేరింది. దీని తర్వాత యంగ్ హీరో నాగ శౌర్య సరసన ‘లక్ష్య’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

ఇందులో ఆమె పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులే పడ్డాయి. కానీ, ఆశించిన సక్సెస్ ఈ సినిమా కూడా ఇవ్వలేకపోయింది. దాంతో తన మూడో సినిమా రంగ రంగ వైభవంతోనైనా హిట్ అందుకోవాలని కేతికా శర్మ చూస్తోంది. మరి హాట్ బ్యూటీకి హిట్ పడుతుందా లేదా చూడాలి.

మహేశ్ బాబు తల్లిగా అలనాటి స్టార్ హీరోయిన్ రీఎంట్రీ ?

టాలీవుడ్ హీరోల కంటే వారి భార్యలే రిచ్..!

సొంత జెట్ ఫ్లయిట్ ఉన్న టాలీవుడ్ స్టార్స్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -