Friday, April 26, 2024
- Advertisement -

స్పైసీగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్న మ‌ల్లు బ్యూటీ

- Advertisement -

కేర‌ళ కుట్టి మీరా జాస్మిన్.. అందంతోనే కాక అభిన‌యంతో ఒక‌ప్పుడు తెలుగు వారి మ‌న‌సు దోచుకున్న న‌టి. ప్ర‌స్తుతం సినిమాల‌కు దూరంగా ఉంటున్న మీరా జాస్మిన్ త్వ‌ర‌లోనే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయ‌బోతోంద‌ట‌. త‌న‌ను తొలిసారి ప‌రిచ‌యం చేసిన డైరెక్ట‌రే ఆమెకు రెండో ఇన్నింగ్స్ కు అవ‌కాశం క‌ల్పించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. నిజానికి మీరా జాస్మిన్ బోయపాటి తొలి హీరోయిన్. రవితేజ హీరోగా నటించిన ‘భద్ర’ చిత్రంలో మీరా కథానాయికగా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.

ప్ర‌స్తుతం అఖండ చిత్రం విజ‌యంతో జోరుమీదున్నాడు దర్శకుడు బోయపాటి. ఈ క్రమంలో తదుపరి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ పోతినేనితో బోయపాటి త‌దుప‌రి చిత్రం తెరకెక్కిన్నట్టు వార్తలొస్తున్నాయి. హై ఓల్టేజ్ యాక్షన్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా అతి త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన ఓ రూమర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రామ్- బోయపాటి చిత్రంలో మల్లూ బ్యూటీ మీరా జాస్మిన్ నటించబోతున్నట్టు సమాచారం. ఇటీవల మీరా జాస్మిన్ హాట్ పిక్స్ తెగ వైరల్ అవడంతో ఈ సినిమాలో ఆమెపై ఓ స్పెషల్ సాంగ్ ను బోయపాటి ప్లాన్ చేస్తున్నారట. టాలీవుడ్ లో మీరా జాస్మిన్ సెకండ్ ఇన్నింగ్స్ స్పైసీ గా ప్రారంభం కానుండడం హాట్ టాపిక్ అయింది.

భారీ ఆఫ‌ర్ ద‌క్కించుకున్న శ్రీలీల‌

రెమ్యూన‌రేష‌న్ భారీగా పెంచేసిన ప్రియామ‌ణి

జోరుమీద ఉన్న చిన్న సినిమాలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -