తప్పు తెలుసుకుంటున్న విజయ్.. ఇకపై వినయం ప్రదర్శిస్తాడా ?

Liger Effect Vijay Devarakonda Kept Attitude Aside?
Liger Effect Vijay Devarakonda Kept Attitude Aside?

సినీ ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ డమ్ రావడం అంటే చాలా అరుదు. అలాంటి అరుదైన స్టార్ డమ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండను వరించింది. ఆయన నటించిన ” అర్జున్ రెడ్డి ” మూవీ సంచలన విజయం సాధించడంతో యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదిచ్చుకొని స్టార్స్ జాబితాలోకి ఎంట్రీ ఇచ్చాడు. విజయ్ దేవరకొండ కంటే ముందే ఎన్నో ఏళ్లుగా స్టార్ స్టేటస్ కోసం పోటీ పడుతున్న యంగ్ హీరోలు నితిన్, రామ్ పోతినేని, నాని, శర్వానంద్ వంటి హీరోలను సైతం వెనక్కినెట్టి స్టార్స్ జాబితాలో కొనసాగుతున్నాడు విజయ్. అయితే విజయ్ కి ఇంత స్టార్డమ్ రావడానికి అతని అట్టిట్యూడ్ కూడా ఒక కారణం అని చెప్పవచ్చు.

ముఖ్యంగా ప్రెస్ మీట్స్ లలోనూ, ప్రీ రిలీజ్ ఈవెంట్లలోనూ విజయ్ చూపే అట్టిట్యూడ్ మరియు బొల్డ్ కామెంట్స్ ఎప్పుడు కూడా హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటాయి. అయితే విజయ్ అట్టిట్యూడ్ చూపడం కొంత పరిధి వరకు బాగానే ఉన్నప్పటికి.. స్టార్ స్టేటస్ వచ్చాక కూడా అట్టిట్యూడ్ డోస్ మరింత పెంచుతుండడంతో విజయ్ వ్యవహార శైలిపై ఆయన అభిమానులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా లైగర్ ప్రమోషన్స్ లో విజయ్ చూపిన అట్టిట్యూడ్, బొల్డ్ కామెంట్స్ పై ఏ స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయో అందరికీ తెలిసిందే.

ఒకరకంగా ” లైగర్ ” డిజాస్టర్ కావడంలో విజయ్ ఓవర్ అట్టిట్యూడ్ కూడా ఒక కారణమనే చెప్పాలి. అందువల్ల ” అర్జున్ రెడ్డి ” తో ఒక్కసారిగా పైకి ఎదిగిన విజయ్.. తన ఓవర్ అట్టిట్యూడ్ కారణంగా ” లైగర్ ” తో అంతే స్థాయిలో కిందపడ్డాడని అందరి నోట వినిపిస్తున్న మాట. దీంతో లైగర్ ఫలితం విజయ్ లో చాలానే మార్పు తీసుకొచ్చిందట. ఇకపై చాలావరకు తన అట్టిట్యూడ్ నూ పక్కనపెట్టి హుందాగా వ్యవహరించేందుకు విజయ్ తనను తాను మార్చుకుంటున్నాట్లు టాలీవుడ్ సినీ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి రౌడీ బాయ్ గా పేరుగాంచిన విజయ్ దేవరకొండ ఇకపై ఎంతమేర హుందాగా వ్యవహరిస్తాడో చూడాలి.

ఇవి కూడా చదవండి

చిరు vs బాలయ్య .. బిగ్ ఫైట్ మిస్ ?

గజిని సిక్వల్.. పోటీలో సూర్య, అల్లు అర్జున్ ?

మహేశ్ తో ధోని సినిమా.. నిజమేనా ?