Saturday, May 4, 2024
- Advertisement -

ఆపరేషన్ ఉత్తరాంధ్ర.. ఘర్షణలు దేనికి సూచన ?

- Advertisement -

ఉత్తరాంధ్రలో ఎప్పుడు లేని విధంగా పోలిటికల్ హీట్ తారస్థాయిలో పెరిగింది. విశాఖ గర్జన పేరుతో వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ నిర్వహించిన కార్యక్రమంలో విశాఖను రాజధానిగా మార్చడం పక్కా అని వైసీపీ నేతలు మరోసారి రుజువు చేశారు. గర్జనలో పాల్గొన్న వైసీపీ నేతలు, మంత్రులు, మాజీ మంత్రులు అందురు కూడా ఇదే విషయాన్ని ఘంటపథంగా చెప్పుకొచ్చారు. ఇక వైసీపీ గర్జన కు పోటీగా పవన్ కూడా విశాఖ కేంద్రంగా తన పర్యటనను ప్రారంభించడంతో ఇరు పార్టీల మద్య కాసింత యుద్ద వాతావరణమే నెలకొనిందని చెప్పవచ్చు. ఒకేరోజు ప్రధాన పార్టీలు తమ కార్యక్రమాలు చేపట్టడంతో ఇరు పార్టీల కార్యకర్తలు ఘర్షణకు దిగారు.

ఎయిర్ పోర్ట్ వద్ద వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేశ్, ఆర్కే రోజా కాన్వాయ్ లపై జనసేన పార్టీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. దాంతో విశాఖలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దాంతో జనసేనానిపై విసిపి నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. జనసేన అసాంఘిక శక్తిలా తయారవుతోందని, ఇది పక్కా పథకం ప్రకారం వైసీపీ నేతలపై జరిగిన దాడి అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. జనసేన కార్యకర్తలు జనసైనికులు కాదని, జనసైకోలు అంటూ మంత్రి అమర్నాథ్ అన్నారు. పవన్ కల్యాణ్ తక్షణమే క్షమాపణ చెప్పాలని వైసీపీ నేతలు కోరారు. అయితే వైసీపీ నేతల వ్యాఖ్యలను జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ తప్పుబట్టారు.

దాడి సంస్కృతి ని జనసేన ప్రోత్సహించదని, ఆ విద్యలో వైసీపీ వాళ్ళే ఆరితేరిపోయారని నాదెండ్ల ఆరోపించారు. పవన్ పర్యటనను దృష్టి మళ్లించేందుకే వైసీపీ నేతలు నాటకాలు ఆడుతున్నారని నాదెండ్ల చెప్పుకొచ్చారు. అయితే విశాఖా కేంద్రంగా మూడు ప్రధాన పార్టీలు ఒకే రోజు కార్యక్రమాలను ప్రారంభించనున్నాయని తెలిసినప్పటికి ఏపీ పోలీసులు నిర్లక్ష వైఖరి ఎందుకు అవలంభించారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. వైసీపీ వాళ్ళు విశాఖ గర్జన ను నిర్వహిస్తే, టీడీపీ వాళ్ళు సేవ్ ఉత్తరాంధ్ర అంటూ సమావేశం నిర్వహించారు. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏకంగా మూడు రోజులు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఇలా మూడు ప్రధాన పార్టీలు ఉన్నఫలంగా ఆపరేషన్ ఉత్తరాంధ్ర అందుకోవడం చూస్తుంటే కేవలం కేవలం రాజకీయ ప్రయోజనలకోసమే మూడు పార్టీలు ఉత్తరాంధ్రపై ఫోకస్ చేశాయి అని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

జగన్, బాబు కక్ష్య రాజకీయాలు.. ప్రజల షాక్ ఎవరికి ?

ఎన్నికల ఖర్చు..: 5000 కోట్లు !

జగనన్న” సినిమా “.. అదిరిపోయే ప్లాన్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -