Thursday, May 2, 2024
- Advertisement -

టి‌ఆర్‌ఎస్ కు షాక్.. బుర్ర నర్సయ్య రాజీనామా ..! బీజేపీ అదిరిపోయే ఆఫర్ ..!

- Advertisement -

మునుగోడు ఉపఎన్నిక వేళ తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా టి‌ఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత భువనగిరి మాజీ ఎంపీ బుర్ర నర్సయ్య గౌడ్ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. బుర్ర మునుగోడు టికెట్ ఆశించినప్పటికి టి‌ఆర్‌ఎస్ పార్టీ అధిష్టానం పట్టించుకోకపోవడంతో ఆయన పార్టీ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇక తాజాగా లేఖ ద్వారా టి‌ఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాల సమస్యలను ప్రస్తావిస్తే.. మీరు అసహనం వ్యక్తం చేయడం నాకు బాధ కల్గించింది. మిమ్మల్ని కలవాలంటే తెలంగాణ ఉద్యమం కన్న పెద్ద ఉద్యమమే చేయాల్సి వస్తోందని లేఖలో ఆయన పేర్కొన్నారు.

అంతే కాకుండా మునుగోడులోనూ బీసీ వర్గానికి అవకాశం ఇవ్వాలని కోరడం నేరమా ? నాకు చెప్పకుండా అభ్యర్థిని ప్రకటించారు ” అంటూ లేఖలో బుర్ర నర్సయ్య గౌడ్ రాసుకొచ్చారు. ఇక బీసీ సామాజిక వర్గంలో బుర్ర నర్సయ్య గౌడ్ కు మంచి పట్టు ఉంది. దాంతో భువనగిరి ఎంపీ టికెట్ నర్సయ్యకు బీజేపీ ఆఫర్ చేసిందట. అందుకే ఆయన టి‌ఆర్‌ఎస్ వీడారనే వార్తలు వస్తున్నాయి. ఇక భువనగిరిలో 2014లో తొలిసారి ఎంపీగా గెలిచిన బుర్ర.. 2019 ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓటమిపాలు అయ్యారు. ఇక్కడ 2019లో బీజేపీ తరుపున పడాల వెంకర శ్యామ్ సుందర్ రావ్ పోటీ చేశారు. అయితే ఈ సారి ఎన్నికల్లో బలమైన నేతగా ఉన్న బుర్ర నర్సయ్యగౌడ్ ను రంగంలోకి దించాలని బీజేపీ ప్లాన్ చేస్తోందట. ఇక త్వరలోనే బుర్ర నర్సయ్య బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా లను కలిసి కాషాయ కండువా కప్పుకోవడం లాంఛనప్రయమే అయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -