అసలు పోలవరం పూర్తవుతుందా.. అంబటి ?

Ambati Rambabu Reaction on Polavaram Project
Ambati Rambabu Reaction on Polavaram Project

ఆంధ్ర ప్రదేశ్ లో పోలవరనికి సంబంధించిన చర్చ ఎప్పటికీ ముగిసిపోని అధ్యాయమనే చెప్పాలి. ఎప్పుడు కూడా దీనికి సంబంధించి రాజకీయ వేడి కొనసాగుతూనే ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోలవరం ప్రాజెక్ట్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ను త్వరితగతంగా పూర్తి చేయడంలో ప్రభుత్వాలు మాత్రం విఫలం అవుతున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నప్పటికి ఈ ప్రాజెక్ట్ మాత్రం ముందుకు కదలడం లేదు. చంద్రబాబు హయాంలో ప్రాజెక్ట్ నిర్మాణంకు సంబంచిందిన సమాచారం అడపాదడప ప్రజలకు తెలుస్తూ ఉండేది. కానీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాజెక్ట్ నిర్మాణంకు సంబంధించిన సమాచారం అసలు ప్రజలకు తెలియకుండానే పోయింది.

ఆ మద్య ఇరిగేషన్ మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని, అసెంబ్లీలో ఘంటాపథంగా చెప్పకొచ్చారు. కానీ ఆయన మాట నిలబెట్టుకోకుండానే మంత్రి పదవి నుంచి నిష్క్రమించారు. ఇప్పుడు 2022 డిసెంబర్ వస్తున్న ఇంతవరకు ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. తీర అనిల్ కుమార్ స్థానంలోకి ఇప్పుడు అంబటి రాంబాబు వచ్చారు. ఇక అంబటి కూడా పోలవరం విషయంలో స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదు. ఆ మద్య పోలవరం ఎప్పుడు పూర్తవుతుందని జనసేన పార్టీ ప్రశ్నించగా.. పవన్ నాలుగో పెళ్లి జరిగినప్పుడు అంటూ వ్యగ్యంగా సమాధానం ఇస్తూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇలా పోలవరంకు సంబంధించిన ప్రశ్నలు ఎప్పుడు ఎదురైన అంబటి తప్పించుకునే ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు తప్పా.. స్పష్టమైన సమాధానం చెప్పే దైర్యం చేయడం లేదు.

ఇక తాజాగా మరోసారి పోలవరంపై తనదైన రీతిలో స్పందించారు మంత్రి అంబటి రాంబాబు. పోలవరం ప్రాజెక్ట్ స్పీల్ వే, శాండ్ ఫిల్లింగ్, లోయర్ కాపర్ డ్యామ్ పనులను పరిశీలించిన ఆయన.. గోదావరి వరద ప్రవాహం తగ్గిపోవడం వల్ల త్వరలోనే ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తామంటూ చెప్పుకొచ్చారు. లోయర్ కాపర్ డ్యామ్ పనులు ప్రారంభం అయ్యాయని, డయా ఫ్రమ్ వాల్ చుట్టూ, వరద నీటిని పూర్తిగా తొలగించిన తరువాత.. ఎర్త్ కం రాక్ ఫీల్డ్ డ్యామ్ పనులు చేపడతామని అంబటి వ్యాఖ్యానించారు. అయితే అంబటి వ్యాఖ్యలను బట్టి చూస్తే.. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందనే విషయంలో స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. దాంతో అసలు పోలవరం పూర్తవుతుందా అంబటి ? అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు కొందరు రాజకీయవాదులు. ఏది ఏమైనప్పటికి ఆంధ్రులు ఎంతగానో ఎదురు చూస్తున్న పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికీ పూర్తవుతుందో మరి !

ఇవి కూడా చదవండి

మోడీ ఇచ్చిన షాక్.. కే‌సి‌ఆర్ అసలు ఊహించలేదా ?

మోడీతో మీటింగ్.. బాబు తో డేటింగ్ పవన్ పై సెటైర్స్ !

కుప్పంలో జగన్.. పులివెందులలో బాబు.. నిలిచి గెలిచేదెవ్వరు ?