Thursday, May 9, 2024
- Advertisement -

ఒక్క ఛాన్స్ అంటున్న పవన్.. జగన్ కు ఇబ్బందే !

- Advertisement -

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయలంతా ప్రస్తుతం వైసీపీ జనసేన చుట్టూనే తిరుగుతున్నాయి. గతంలో వైసీపీ టీడీపీ పార్టీలు మాత్రం బలమైన ప్రత్యర్థులుగా ఉండగా.. ప్రస్తుత పరిణామాలు చేస్తుంటే టీడీపీ ప్లేస్ లోకి జనసేన వచ్చేసినట్లే కనిపిస్తోంది. వైసీపీ కూడా టీడీపీ ని లైట్ తీసుకొని జనసేన పైనే ఎక్కువ ఫోకస్ చేస్తోంది. గతంలో జనసేన అధినేత పవన్ పై పార్ట్ టైమ్ పాలిటీషియన్ అనే ముద్ర ఉండేది. దీంతో ప్రజల్లో కూడా పవన్ పై స్థిరమైన నిర్ణయం ఉండేది కాదు.. అయితే ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను బయటకు తీస్తూ..వైసీపీ ని ఢీ కొట్టేది జనసేననే అనే సంకేతాలను బలంగా పంపుతున్నారు పవన్. .

ఫలితంగా ప్రస్తుతం వేగంగా బలపడుతున్న పార్టీగా జనసేన ముందుకు సాగుతోంది. ఇక వచ్చే ఎన్నికల్లో జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోన్న పవన్.. ఆదిశగా వెస్తోన్న ప్రతి అడుగు సక్సస్ అవుతోంది. గత ఎన్నికల్లో వైఎస్ జగన్ అధికారంలోకి రావడానికి ఆయన అందుకున్న ” ఒక్క ఛాన్స్.. ” నినాదం కూడా అత్యంత ప్రభావం చూపింది. 2014 ఎన్నికల ఓటమి తరువాత ప్రజా సానుభూతి పొందేందుకు ” ఒక్క ఛాన్స్..ప్లీజ్ ” అంటూ బలంగా ప్రజల్లోకి వెళ్లారు జగన్. అప్పటికే బాబు పాలనపై అసహనంగా ఉన్న ఏపీ ప్రజానీకం..జగన్ అందుకున్న ” ఒక్క ఛాన్స్ ప్లీజ్ ” నినాదానికి ఆకర్షితులై.. 2019 ఎన్నికల్లో వైసీపీ కనీవినీ ఎరుగని విజయాన్ని కట్టబెట్టారు.

ఇప్పుడు వ్యూహాన్ని పవన్ కూడా అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అప్పుడు బాబు పాలనపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో.. ఇప్పుడు కూడా జగన్ పాలనపై వ్యతిరేకత అంటే స్థాయిలో ఉంది. అందుకే ఏపీ ప్రజానీకం జనసేన వైపు చూసే విధంగా ” ఒక్క ఛాన్స్ ప్లీజ్ ” అంటూ పవన్ సరికొత్త నినాదాన్ని అందుకున్నారు. తాజాగా విజయనగరం జిల్లా గుంకాలంలోని జనగన్న ఇళ్లను పరిశీలించిన జనసేనానని.. అక్కడ చేసిన వ్యాఖ్యాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.

ఒక్క ఛాన్స్ ఇవ్వండి అవినీతి రహిత పాలన అంటే ఏంటో చూపిస్తానని, మీ పిల్లల భవిష్యత్త్ కోసం జనసేనకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ పవన్ నినాదించారు. ఈ ” ఒక్క ఛాన్స్.. ” అనేది ప్రజా సెంటిమెంట్ ను తీవ్రంగా ప్రభావితం చేసే నినాదం.. ఈ నినాదంతోనే గత ఎన్నికల్లో జగన్ తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు జగన్ ను గద్దె దించేందుకు ఆయన బాటలోనే పవన్ కూడా ఒక్క ఛాన్స్ నినాదం అందుకున్నారు. మరి పవన్ కు ఈ సెంటిమెంటల్ నినాదం ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -