Sunday, April 28, 2024
- Advertisement -

కుప్పంలో జగన్.. పులివెందులలో బాబు.. నిలిచి గెలిచేదెవ్వరు ?

- Advertisement -

ప్రస్తుతం ఏపీలోని రెండు ప్రధాన పార్టీల అధ్యక్షులు ఒకరి నియోజిక వర్గంపై మరొకరు కన్నేశారు. వైఎస్ జగన్ చంద్రబాబు నియోజిక వర్గం అయిన కుప్పంపై కన్నేస్తే.. బాబు పులివెందులపై ఫోకస్ చేస్తున్నారు. ఇలా వారి వారి సొంత నియోజిక వర్గాల్లో తమ ఆదిపత్యం ప్రదర్శించుకునేందుకు ముమ్మర కసరత్తులు చేస్తూ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అయితే ఈ విషయంలో వైఎస్ జగన్ కాస్త ముందు వరుసలో ఉన్నారనే చెప్పాలి. ఇప్పటికే కుప్పం లో స్థానిక ఎన్నికల్లో సత్తా చాటిన వైసీపీ.. వచ్చే ఎన్నికల్లో మాత్రం ఎలాగైనా కుప్పం సీటులో వైసీపీ జెండా ఎగరాలనే దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఆ దిశగానే ప్రణాళికలు వేస్తూ ముందుకు సాగుతున్నారు. కుప్పంలో తమ పార్టీని గెలిపిస్తే ఆ నియోజిక వర్గ ఎమ్మెల్యే కు మంత్రి పదవి ఇస్తానని ఇప్పటికే జగన్ హామీ కూడా ఇచ్చారు. అలాగే కుప్పంలో బాద్యతలు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి అప్పగించి బాబు కు చెక్ పెట్టె ప్రయత్నం చేస్తున్నారు జగన్. .

ఇలా బాబు నియోజిక వర్గంపై జగన్ ఫోకస్ చేస్తుంటే.. బాబు కూడా పులివెందులలో పాగా వేసేందుకు సిద్దమయ్యారు. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో పులివెందులలో జగన్ కు షాక్ ఇవ్వాలని బాబు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల నియోజిక వర్గ ఇన్ చార్చ్ లతో భేటీ అయ్యారు. ఆ భేటీ లో పలు ఆసక్తికర విషయాలను ప్రస్తావించారు. జగన పాలన తీరు తోనూ, విద్వేషా రాజకీయాలతోనూ పులివెందులకు చెడ్డ పేరు వస్తోందని, ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ కు ఇదే అదే ఆఖరి ఛాన్స్ అంటూ ఎద్దేవా చేశారు. రివర్స్ పాలన కారణంగా పులివెందుల నియోజికవర్గంలో జగన్ పాలనపై తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతోందని, వివేకా హత్య కేసులో దొషులను ముఖ్యమంత్రి కాపాడడం పులివెందుల ప్రజలకు నచ్చడం లేదంటూ వ్యాఖ్యానించారు.

వచ్చే ఎన్నికల్లో పులివెందులలో కచ్చితంగా తెలుగుదేశం విజయం సాధించాలని, ఆ దిశగా నేతలు పని చేయాలని బాబు సూచించారు. అయితే బాబు ఆకాంక్షిస్తున్నట్లు పులివెందులలో టీడీపీ సత్తా చాటగలదా ? అంటే కష్టమే అంటున్నారు విశ్లేషకులు ఎందుకంటే రాయలసీమలో వైసీపీకి బలమైన క్యాడర్ ఉంది. 2019 ఎన్నికల్లో రాయలసీమ మొత్తంలో 52 అసెంబ్లీ స్థానాలకు గాను మూడు సీట్లు మినహా మొత్తం 49 స్థానాల్లో వైసీపీ సత్తా తాటింది. ఇంత బలంగా ఉన్న వైసీపీని అది కూడా జగన్ నియోజిక వర్గంలో ఆయనను ఓడించడం అంతా సులువు కాదని కొందరి వాదన. అయితే కుప్పంలో బాబునూ ఓడించేందుకు జగన్ ఎలాంటి ప్రణాళికలు వేస్తున్నారో.. అదే విధంగా పులివెందులలో జగన్ నూ ఓడించేందుకు బాబు కూడా అదే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు. మరి పులివెందులలో జగన్ తో ఢీ కొట్టి బాబు గెలుస్తారో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

పవన్ను ఫాలో అవుతున్న లోకేశ్.. ?

ప్రశ్నలెన్నో.. సమాధానం చెప్తారా మోడీజీ !

రాష్ట్రాన్ని పాలించేది గవర్నర్లా .. ముఖ్యమంత్రులా ? అసలేంది ఈ రచ్చ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -