వామ్మో..వీరసింహారెడ్డిలో 11 యాక్షన్ సీన్స్?

Balakrishna Power Packed Action Scenes in Veera Simha Reddy Movie
Balakrishna Power Packed Action Scenes in Veera Simha Reddy Movie

నటసింహా నందమూరి బాలకృష్ణ అనగానే హైవోల్టేజ్ యాక్షన్ సీన్స్ కు పెట్టింది పేరు. సింహా, లెజెండ్ వంటి సినిమాలలో బాలయ్య యాక్షన్ ఎపిసోడ్సే మేజర్ హైలెట్ గా నిలిచాయి. ఇక గత ఏడాది డిసెంబర్ లో వచ్చిన అఖండ మూవీలో అయితే ప్రతి అయిదు నిముషాలకు ఒక యాక్షన్ ఎపిసోడ్ తో బాలయ్య నట విశ్వరూపం చూపించారు. ఇక తన అప్ కమింగ్ మూవీ ” వీరసింహారెడ్డి ” మూవీలో కూడా హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ పుష్కలంగా ఉన్నాయట. ఏకంగా పదకొండు భారీ యాక్షన్ సీన్స్ ను ఈ మూవీ కోసం డిజైన్ చేశారట డైరెక్టర్ గోపిచంద్ మలినేని. రాయలసీమ నేపథ్యంలో పక్కా ఫ్యాక్షన్ మూవీగా రూపొందుతున్న ఈ మూవీలో యాక్షన్ సీన్సే మేజర్ హైలెట్ అవుతాయట. అందుకే ఎక్కడ కంప్రమైజ్ కాకుండా సినిమాకు అవసరమైన రీతిలోనే 11 యాక్షన్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

ఈ యాక్షన్ సీన్స్ లో బాలయ్య నట విశ్వరూపం చూపించారని మూవీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఇక ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. బాలయ్య నుంచి సంక్రాంతి కానుకగా వచ్చిన మూవీస్ అన్నీ కూడా బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. దాంతో ఈ మూవీ కూడా పక్కా బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని చిత్రయూనిట్ కాన్ఫిడెంట్ గా ఉంది. అయితే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి ” వాల్తేరు వీరయ్య “, తలపతి విజయ్ ” వారసుడు ” వస్తున్నప్పటికి బాలయ్య మూవీ ” వీరసింహారెడ్డి ” పైనే స్పెషల్ క్రేజ్ నెలకొంది. మరి సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, చెన్నకేశవరెడ్డి వంటి ఫ్యాక్షన్ సినిమాల తరువాత చాలా ఏళ్లకి మళ్ళీ వీరసింహారెడ్డి తో మరోసారి ఫ్యాక్షన్ పంజా విసరబోతున్నారు నాటసింహా నందమూరి బాలకృష్ణ. మరి ఈ మూవీతో బాలయ్య ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తారో చూడాలి. ఇక ఈ మూవీక థమన్ మ్యూజిక్ అందిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

“సలార్” ఎవరి ఊహలకు అందదట!

పూరీ జగన్నాథ్ పై స్టార్ హీరోలకు నమ్మకం పోయిందా ?

అల్లు అర్జున్ ” ఐకాన్ ” లేనట్లేనా ?