- Advertisement -

పూరీ జగన్నాథ్ పై స్టార్ హీరోలకు నమ్మకం పోయిందా ?

- Advertisement -

హీరోయిజాన్ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేయడంలో పూరీ జగన్నాథ్ స్టైలే వేరు.తన హీరోలను డిఫరెంట్ మేనరిజంతో, డిఫరెంట్ స్టైల్ లో ప్రజెంట్ చేస్తూ ఊర మాస్ గా చూపించడంలో పూరీ జగన్నాథ్ తరువాతే ఎవరైనా అని చెప్పవచ్చు. పవన్ కల్యాణ్ కు బద్రి, రవితేజ కు ఇడియట్, మహేశ్ బాబు కు పోకిరి, ప్రభాస్ కు బుజ్జిగాడు, అల్లు అర్జున్ కు దేశముదురు.. ఇలా ప్రతి స్టార్ హీరోకి వారి కెరియర్ లోనే గుర్తిండిపోయే సినిమాలను ఇచ్చారు పూరీ జగన్నాథ్. ఒక చెప్పాలంటే మాస్ హీరోయిజనికి సెల్ఫ్ అట్టిట్యూడ్ యాడ్ చేయడంలో పూరీ తరువాతే ఎవరైనా. అలాంటి డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తోంది. .

టెంపర్ మూవీ తరువాత ఓ స్టార్ హీరోతో కూడా మూవీ చేయని పూరీ వరుసగా యంగ్ హీరోలతో మూవీస్ చేస్తూ దారుణమైన ఫ్లాప్స్ మూటగట్టుకుంటున్నాడు. ఆ మద్య రామ్ పోతినేని తో తీసిన ఇస్మార్ట్ శంకర్ కాస్త పర్వాలేదనిపించినప్పటికి స్టార్స్ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. మహేశ్ తో జనగనమన మూవీ ప్లాన్ చేసినప్పటికీ స్టోరీ నచ్చకపోవడంతో మహేశ్ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఆ తరువాత అల్లు అర్జున్, జూ. ఎన్టీఆర్ తో మూవీ చేసేందుకు ప్రయత్నించినప్పటికి డేట్స్ దొరకకపోవడంతో మళ్ళీ యంగ్ హీరోలనే ఎంచుకున్నాడు పూరీ. ఇక ప్రస్తుతం యూత్ లో సూపర్ క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండతో తీసిన ” లైగర్ ” మూవీ కూడా దారుణంగా ఫ్లాప్ అయింది.

దీంతో పూరీతో మూవీ చేసేందుకు యంగ్ హీరోలు సైతం వెనుకడుగు వేస్తున్నారు. లైగర్ సెట్స్ పై ఉండగానే విజయ్ తో ” జనగనమన ” అనౌన్స్ చేశాడు పూరీ. అయితే లైగర్ ఫ్లాప్ అవ్వడంతో ఆ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది. ప్రస్తుతం పూరీ చేతిలో ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదు. అయితే పూరీ రైటింగ్ లో మునుపటి పవర్ లేదని, ఏదో సొ సొ గా స్క్రిప్ట్ రాసి మూవీని చేట్టెస్తాడని ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. అందుకే స్టార్ హీరోలు పూరీతో మూవీ చేసేందుకు సిద్దంగా లేరనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ‘ లైగర్ ” ఫ్లాప్ ద్వారా తీవ్రమైన ఫైనాన్సియల్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న పూరీ.. తన తదుపరి సినిమా ఎవరితో తీస్తాడో చూడాలి.

ఇవి కూడా చదవండి

డెడికేషన్ అంటే ఇది.. ఫిదా చేస్తోన్న రామ్ చరణ్ !

అయ్యో :మహేశ్ కు 2022 అంతా చేదు జ్ఞాపకాలే!

అల్లు అర్జున్ ” ఐకాన్ ” లేనట్లేనా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -