Monday, May 6, 2024
- Advertisement -

పవనే కరెక్ట్.. నేను కాదు: చిరంజీవి!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో రాణించాలంటే చాలా కష్టమని, అక్కడ సెన్సిటివ్ గా ఉంటే కుదరదు అని చిరంజీవి అన్నారు. అక్కడ రాణించాలంటే మొరటుదేలాలి.. రాటుదేలాలి, అనాలి.. అనిపించుకోవాలి.. అవసరమా ఇదంతా అందుకే వెనక్కి వచ్చేశా అంటూ, వాటికి తానే కరెక్ట్.. తను అంటాడు అనిపించుకుంటాడు. ఏదో ఒకరోజు మీ అందరి సపోర్ట్ తో అత్యున్నత స్థానంలో చూస్తాం అంటూ పవన్ను ఉద్దేశించి చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇక గతంలో రాజకీయాల ప్రస్తావన వచ్చిన ప్రతిసారి దాటవేసే చిరు.. ఈ మద్య రాజకీయ ప్రస్తావనపై తరచూ స్పందిస్తున్నారు. ఇటీవల గాడ్ ఫాదర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ తన తమ్ముడని, అవసరమైతే తన సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని కూడా చెప్పిన సంగతి విధితమే..

దాంతో చిరు జనసేనలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్తలు గట్టిగానే వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు తనకు రాజకీయాలు సెట్ కావు అన్నట్లుగా తాజాగా వ్యాఖ్యానించారు. దీంతో ప్రస్తుత పాలిటిక్స్ పై చిరు ఆలోచన ఏంటి అనే చర్చ జరుగుతోంది. ఇక 2009 లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి 20 స్థానాలను గెలుచుకున్న చిరు ఆ తరువాత అనూహ్యంగా ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఇక అప్పటి నుంచి రాజకీయకు దూరంగానే ఉంటూ వచ్చారు. ప్రస్తుతం తమ్ముడు పవన్ కల్యాణ్ ఏపీ పాలిటిక్స్ లో క్రియాశీలకంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయానికి పవన్ కు అండగా చిరు జనసేనలో అడుగుపెట్టిన ఆశ్చర్యం లేదు. ఈప్పటికే చిరంజీవి మరో తమ్ముడు నాగబాబు జనసేనలో యాక్టివ్ గా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో చిరు పోలిటికల్ రీఎంట్రీ ఉంటుందో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

చంద్రబాబు ఒంటరి పోరు సాధ్యమేనా?

రివేంజ్ పాలిటిక్స్ .. అప్పుడు జగన్ ఇప్పుడు బాబు!

కవితకు బీజేపీ ఆహ్వానం.. నిజమే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -