Monday, April 29, 2024
- Advertisement -

అల్లు అర్జున్ ” ఐకాన్ ” లేనట్లేనా ?

- Advertisement -

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప పార్ట్ 1 అన్నీ భాషల్లో కూడా సూపర్ హిట్ కావడంతో పార్ట్ 2 ను మరింత గ్రాండ్ గా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు డైరెక్టర్ సుకుమార్. ఇక పుష్ప తరువాత బన్నీ క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది. బాలీవుడ్ లో సైతం స్టార్ స్టేటస్ అందుకున్నారు. దాంతో పుష్ప పార్ట్ 2 తరువాత బన్నీ చేసే మూవీస్ పై ఇప్పటి నుంచే చర్చ జరుగుతోంది. పుష్ప సూపర్ హిట్ వల్ల ” పుష్ప పార్ట్ 2 ” పై తారస్థాయిలో అంచనాలు నెలకొనడం ఖాయం.

అయితే ఇప్పుడు సమస్యంతా బన్నీ తరువాత సినిమాలపైనే. పుష్ప పార్ట్ 2 తరువాత బన్నీ తో సినిమా తీసే డైరెక్టర్ ఎవరు ? ఎలాంటి స్క్రిప్ట్ కు బన్నీ ఒకే చెబుతాడు అనే ప్రశ్నలు సినీ అభిమానుల్లో గట్టిగా వినబడుతున్నాయి. అయితే బన్నీ చేతిలో ప్రస్తుతం పుష్ప రెండవ భాగం మినహా వేరే ప్రాజెక్ట్ లు ఏవి లేవు. గతంలో కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ ఓ మూవీని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఏమైందో తెలియదు గాని కొరటాల శివ బన్నీ ప్రాజెక్ట్ ను పక్కన బెట్టి ఎన్టీఆర్ తో కమిటయ్యారు. ఇక బన్నీ కోసం వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నాడు.

వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో ” ఐకాన్ ” మూవీ అనౌన్స్ చేశారు. దిల్ రాజు నిర్మాణంలో ఈ మూవీ తెరకెక్కనుంది. పుష్ప కంటే ముందే అనౌన్స్ అయిన ఈ ప్రాజెక్ట్ ఇంతవరకు సెట్స్ పైకి వెళ్లలేదు. ఇక పుష్ప తరువాత బన్నీ ఇమేజ్ పాన్ ఇండియా స్థాయిలో విస్తరించడంతో ” ఐకాన్ ” మూవీ స్క్రిప్ లో చాలానే మార్పులు చేయాల్సి వస్తుంది. మరి మార్చిన స్క్రిప్ట్ బన్నీ ని మెప్పిస్తుందా అనేది చెప్పడం కష్టమే. దాంతో ఈ ప్రాజెక్ట్ దాదాపుగా లేనట్లేనాని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆ మద్య నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ కచ్చితంగా ఉంటుందని, చెప్పినప్పటికి ఎప్పుడు అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మరి ఐకాన్ ఉంటుందో ఉండదో చూడాలి.

ఇవి కూడా చదవండి

స్టార్ హీరో కొడుకుగా విజయ్ దేవరకొండ ?

నాగ్, వెంకీ మూవీస్ కు బ్రేక్.. ఇవ్వబోతున్నారా ?

ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్..హీరోలు ఎవరో తెలిసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -