జియో కొత్త పథకం.. 100 శాతం క్యాష్ బ్యాక్

jio exchange offer deposit old data card dongle get 4g rout

రిజ‌ల‌య‌న్స్ జియే దేశీయ టెలికంరంగంలో సంచ‌ల‌నం సృష్టించింది. జియో దెబ్బ‌కు అన్ని టెలికం కంపెనీలు టారిప్‌ల‌ను త‌గ్గించి వివిధ ర‌కాల ఆఫ‌ర్ల‌తో ముందుకొస్తున్నాయి. ఇత‌ర కంపెనీలు ఎలాంటి ఆఫ‌ర్లు ప్ర‌క‌టించినా జియోను మాత్రం అందుకోలేక‌పోయాయి. ఇప్ప‌టే త‌న క‌ష్ట‌మ‌ర్ల‌కు ఆఫ‌ర్లు ప్ర‌క‌టించిన జియో ఇప్పుడు మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ముందుకు తీసుకొచ్చింది.

ప్రత్యర్థులు ఆఫర్ చేస్తున్న పాత డోంగిల్, డేటా కార్డు, వైఫై రూటర్లను జియో వైఫై 4జీ రూటర్ తో ఎక్స్చేంజ్ చేసుకుంటే 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది. రెండు ప్లాన్స్ గా జియో ఈ సంచలన ఆఫర్ ను ప్రకటించింది. ఒకటి ప్రస్తుత డేటా కార్డు, డోంగిల్, హాట్ స్పాట్ రూటర్ ను జియో డిజిటల్ స్టోర్ లో ఎక్కడ ఎక్స్చేంజ్ చేసుకున్నా 100 శాతం క్యాష్ బ్యాక్ లేదా డివైజ్ ఎక్స్చేంజ్ కు రూ.2010విలువైన 4జీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. జియోఫై రూటర్ పొందడానికి కస్టమర్లు రూ.1,999 చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ప్లాన్ వ‌ర్తించాలంటే 309 ప్లాన్ కింద కచ్చితంగా మొదటిసారి 408 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాలి. 99 రూపాయల ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకుని ఉండాలి. కస్టమర్లు చెల్లించిన 1999 రూపాయలను 2010 రూపాయల విలువైన 4జీ డేటాతో మైనస్ చేస్తే కస్టమర్లకు ఇంటర్నెట్ కనెక్షన్ దాదాపు ఉచితంగా లభించనుంది. ఇక రెండో ప్లాన్ కింద యూజర్లు తమ డేటా కనెక్షన్లు ఎక్స్చేంజ్ చేసుకోవాల్సినవసరం లేదు. కచ్చితంగా రీఛార్జ్ చేపించుకోవాల్సిన 408 రూపాయలతో తొలి రీఛార్జ్ చేపించుకుంటే చాలు 1,999కే జియోఫై అందుబాటులో ఉంటుంది. కానీ దీనికింద కేవలం 1005 రూపాయల విలువైన 4జీ డేటాను మాత్రమే పొందడానికి వీలుంటుంది.

Related

  1. మరో సంచలన ప్రకటన చేసిన జియో.. 40 రూపాయలకే 200పైగా చానెల్స్
  2. జియో సూపర్ ఆఫర్ : 810 జీబీ డేటా ఇస్తుంది
  3. ”ధ‌న్ ధ‌నా ధ‌న్” ఆఫర్ ఇచ్చిన జియో.. తెలుసుకుంటే వావ్ అంటారు
  4. జియో మరో సూపర్ ఆఫర్.. ఇంకో సంవత్సరం పాటు పండగ