నా యుద్దం నేనే చేస్తా : పవన్ కల్యాణ్!

Pawan Kalyan Political comments in Ippatam Village Tour
Pawan Kalyan Political comments in Ippatam Village Tour

ఏపీ రాజకీయాలు గత కొన్ని రోజులుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ఆ మద్య విశాఖ ఘటన అయితేనేమీ, మంగలగిరిలో వైసీపీ నేతలపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలు అయితేనేమీ.. ఇప్పటం గ్రామ పర్యటనలో చోటు చేసుకున్నా పరిణామలైతేనేమి.. ఇలా ప్రతీది కూడా పవన్ కేంద్రంగా హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉన్నాయి. ఇక వైఎస్ఆర్ పార్టీ నేతలు కూడా టీడీపీ ని లైట్ తీసుకొని జనసేనను నిలువరించే పనిలో ఉన్నారు. దీంతో జనసేన వర్సస్ వైసీపీ మద్య రాజకీయ వివాదం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. .

ఇదిలా ఉండగా ఇప్పటం గ్రామంలో అక్రమంగా ఇల్లు కూల్చివేతపై పవన్ ఆ మద్య తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చినందుకే వైసీపీ ప్రభుత్వం ఈ దుశ్చర్యకు పాల్పడుతోందని పవన్ ఘాటు వ్యాఖ్యాలు చేస్తూ.. ఇల్లు నష్టపోయిన వారికి ఆర్థిక సాయం అందిస్తానంటూ హామీ ఇచ్చారు. తాజాగా ఇచ్చిన హామీని నెరవేర్చుతూ ఇప్పటం గ్రామంలో ఇల్లు నష్టపోయిన వారికి ఆర్థిక సాయన్ని అందించారు పవన్. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటం గ్రామంలో ఇల్లు కూల్చి తన గుండెల్లో గునపం దింపారాని పవన్ వ్యాఖ్యానించారు. 2024లో వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తానని సవాల్ విసిరారు.

నేను మీలాగా డిల్లీ వెళ్ళి చాడీలు చెప్పనని,వైసీపీ ని దెబ్బ కొట్టాలంటే పిఎంతో చెప్పి చేయనని, తానే తేల్చుకుంటానని.. నా యుద్దం నేనే చేస్తానని పవన్ చెప్పుకొచ్చారు. జనసేన పార్టీకి స్థలం ఇచ్చారనే ఒక్క కారణం చేత ఇప్పటం గ్రామంలో ఇళ్లను కూల్చివేస్తూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని కూల్చకుండా వదిలేసి.. కేవలం కక్షపూరితంగానే ఇదంతా వైఎస్ జగన్ చేస్తున్నారని మండి పడ్డారు. వైసీపీ నాయకులు వీధి రౌడిల్లా ప్రవర్తిస్తే ఏం చేయాలో తనకు తెలుసని పవన్ వ్యాఖ్యానించారు. ఒట్టేసి చెబుతున్నా ఓట్లు వేసిన వేయకపోయినా.. తను అండగా ఉంటానని హామీ ఇచ్చారు పవన్. ప్రస్తుతం పవన్ చేసిన వ్యాఖ్యలు పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

రోజా పందిలా తింటది: కే‌ఏ పాల్ హాట్ కామెంట్స్!

కాంగ్రెస్ కే ఎందుకు ఈ అగ్ని పరీక్ష!

జగన్ ట్విస్ట్ లు, బాబు ప్లాన్లు.. హిట్ పెంచుతోన్న వ్యూహాలు!