Saturday, May 4, 2024
- Advertisement -

దిల్ రాజు కు చుక్కలు చూపిస్తున్న విజయ్!

- Advertisement -

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో తలపతి విజయ్ తో ” వారసుడు ” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ తెలుగు తమిళ్ ఇండస్ట్రీ లలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా చుట్టూ ఇటీవల వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. అసలే సంక్రాంతి రేస్ లో మెగాస్టార్ చిరు, నటసింహ బాలయ్య మూవీస్ తో పోటీ పడుతున్న వారసుడు మూవీ.. థియేటర్ల కేటాయింపులో గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. పండగ సీజన్ లలో మొదట తెలుగు సినిమాలకే ప్రదాన్యత ఇవ్వాలని టాలీవుడ్ నిర్మాతల సంఘం నిర్ణయించడంతో బడా ప్రొడ్యూసర్ దిల్ రాజుకు షాక్ తగిలింది. .

ఈ వివాదం రెండు ఇండస్ట్రీల మద్య కూడా అగ్గి రాజేస్తోంది. ఇది ల్చాలదు అన్నట్లుగా మరో కొత్త వివాదం ఈ మూవీని చుట్టూ ముట్టింది. మూవీలో అనుమతి లేకుండా ఏనుగులను వినియోగించుకున్నారని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద మూవీ నిర్మాత దిల్ రాజుకు నోటీసులు జారీ చేసింది. దీనిపై దిల్ రాజు వెంటనే వివరణ ఇవ్వాలని నోటీసులో కోరింది. దీంతో ములిగే నక్క మీద తాటికాయ పడ్డాట్లైంది. దిల్ రాజు పరిస్థితి. ఇక ఈ మూవీ తమిళ్ మూవీగా రూపొందింది తెలుగులోకి డబ్ చేయనున్నారు. అయితే తెలుగులో కూడా విజయ్ తలపతికి మంచి మార్కెట్ ఉండడంతో మూవీపైన తెలుగులో కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి. మొత్తానికి మొదటి సారి తమిళ్ హీరోతో నిర్మిస్తున్న మూవీ దిల్ రాజుకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టిందనే చెప్పాలి. మరి వీటన్నిటిని క్రియర్ చేసుకొని మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తారా లేదా దిల్ రాజు వాయిదా వేస్తారా అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి

సమ్మర్ హీట్ పెంచుతోన్న స్టార్ హీరోలు!

హర్రర్ మూవీలో ప్రభాస్.. ఓన్లీ తెలుగులోనే!

భారీ బయోపిక్ ను రిజక్ట్ చేసిన మహేశ్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -