Sunday, April 28, 2024
- Advertisement -

రోజా పందిలా తింటది: కే‌ఏ పాల్ హాట్ కామెంట్స్!

- Advertisement -

కే‌ఏ పాల్ ఈ పేరును గురించి పెద్దగా పరిచయం అవసరంలేదు. ఒకప్పుడు క్రైస్తవ మత ప్రభోధకుడిగా ప్రపంచ దేశాల్లో పేరు గఢించిన ఈయన ప్రస్తుతం ప్రజాశాంతి అనే పోలిటికల్ పార్టీ స్థాపించి రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఏపీలో గత ఎన్నికల ముందు పాల్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఆయన పార్టీ ప్రభావం ప్రజల్లో ఏమాత్రం లేకపోయిన తనదే గెలుపని, తనను గెలిపిస్తే ఏపీని మరో అమెరికా చేస్తానని ఎలా ఎన్నో రకాల కామెంట్లు చేస్తూ ఆయన చేసిన విచిత్ర ప్రచారం ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. తీర ఎన్నికల రిజల్ట్స్ తరువాత ఆపార్టీకి నమోదైన ఓట్ల ప్రస్తావనే లేకపోవడంతో.. విదేశాలకు చెక్కేశారు కే‌ఏ పాల్.

ఇక అడపా దడపా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వీడియోస్ రిలీజ్ చేస్తూ ప్రభుత్వంపై తనదైన రీతిలో కామెంట్లు చేస్తూ తాను ఉన్నానని గుర్తుచేస్తూ ఉంటాడు. ఇక ఇటీవల తెలంగాణలోని మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో పాల్ హడావిడి ఏ స్థాయిలో ఉండిందో అందరం చూశాం. ఎంత హడావిడి చేసినప్పటికీ పాల్ ను రాజకీయ నేతగా ప్రజలు అంగీకరించడం లేదని ఆ ఎన్నికల ఫలితాలతో మరోసారి రుజువైంది. అయినప్పటికి పాల్ రాజకీయాలకు దూరంగా ఉండే ప్రసక్తే లేదని చెబుతున్నారు. ఇంతవరకు తెలంగాణపై ఫోకస్ చేసిన పాల్ ఇప్పుడు మళ్ళీ ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టారు.

తాజాగా జగన్ ప్రభుత్వంపైన, అలాగే మంత్రి రోజా, మాజీ మంత్రి కొడాలి నాని పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో సి‌ఎం జగన్ ఎంత ఫెయిల్ అయ్యారో అందరికీ తెలుసని, మూడున్నర ఏళ్లుగా ప్రధాని మోడీకి జగన్ పాద పూజా చేస్తున్నప్పటికి స్పెషల్ స్టేటస్ తీసుకురాలేక పోయారని కే‌ఏ పాల్ విమర్శించారు. ఇక మంత్రి రోజాను ఉద్దేశించి మాట్లాడుతూ.. ” పందిలా తింటదని, పిచ్చి కుక్క కరిస్తే ఎలా మాట్లాడుతారో అలా మాట్లాడుతుందని.. ” ఎద్దేవా చేశారు పాల్. ఇక కొడాలి నానిపై కూడా తనదైన రీతిలో విమర్శలు చేశారు పాల్.. ” కొడాలి నాని వాడేవాడో నాకు తెలియదని.. ..నా పేరేందుకు తీసుకొస్తున్నారని ” ఘాటుగా ప్రశ్నించారు. ఇక జగన్ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవని విమర్శిస్తూ.. అభివృద్ది కోరుకునే వారు తమ ప్రజా శాంతి పార్టీలో చేరాలని కే‌ఏ పాల్ సూచించారు. ప్రస్తుతం వైసీపీ నేతలపై పాల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

పాపం కాంగ్రెస్ పరిస్థితి ఎందుకిలా ?

రాజ్యాంగంపై జగన్ కామెంట్స్.. నెటిజన్స్ ఫైర్ !

మేనిఫెస్టో ఫలితం.. ఎలా ఉంటుందో ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -