Sunday, April 28, 2024
- Advertisement -

జగన్ ట్విస్ట్ లు, బాబు ప్లాన్లు.. హిట్ పెంచుతోన్న వ్యూహాలు!

- Advertisement -

ఆంధ్ర ప్రదేశ్ లో అప్పుడే ఎన్నికల హిట్ మొదలైపోయింది. ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికి..ఇప్పటినుంచే పార్టీలలో సంస్థాగత మార్పులకు శ్రీకారం చూడుతున్నారు అధినేతలు. వచ్చే ఎన్నికలు అటు వైసీపీకి ఇటు టిడిపికి రెండు పార్టీలకు కూడా కీలకమే. 175 స్థానాలను టార్గెట్ గా పెట్టుకున్న వైసీపీ.. భారీ విజయంపైన కన్నెస్తే.. మరోవైపు టిడిపికి ఈ ఎన్నికలు తప్పక గెలవాల్సిన పరిస్థితి. దాంతో రెండు పార్టీలు కూడా పక్కా ప్రణాళిక బద్దంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీలో ఊహించని మార్పులు చేస్తున్నారు వైఎస్ జగన్.. నేతల పనితీరును ప్రామాణికంగా తీసుకొని ఎలాంటి మొహమాటం లేకుండా ప్రక్షాళన చేస్తున్నారు. .

ఇప్పటికే పార్టీ రీజినల్ కొ ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల విషయంలో ఊహించని మార్పులు చేసి పార్టీలోని కీలక నేతలకు కూడా షాక్ ఇచ్చారు. గతంలో ఆయా జిల్లాలకు రీజినల్ కొ ఆర్డినేటర్లుగా పని చేసిన బుగ్గన రాజేంద్ర నాథ్, సజ్జల, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారిని సైతం ఆ పదవుల నుంచి పక్కన పెట్టేశారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. ప్రస్తుతం పార్టీ ప్రక్షాళన విషయంలో జగన్ ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నదనేది. దాంతో ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై కూడా జగన్ వైఖరి ఎలా ఉనబోతుందనే ఆయా నేతల్లో మెదులుతున్న ప్రశ్న. ఎందుకంటే ఆమద్య గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో యాక్టివ్ గా లేని 27 ఎమ్మెల్యేలకు గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు జగన్. దీంతో ఇంకా తీరు మార్చుకొని ఎమ్మెల్యేలపై ఉద్వాసన తప్పదనే వార్తలు వస్తున్నాయి.

దాంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలలో వచ్చే ఎన్నికలకు గాను ఎవరెవరికి టికెట్లు వస్తాయనేది ఆసక్తికరం. ఇక తెలుగుదేశం విషయానికొస్తే ఈసారి భారీగా సీనియర్లను పక్కన పెట్టె సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో యువతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని చూస్తున్నారు చంద్రబాబు. ఇప్పటికే 175 నియోజిక వర్గాలలోని సిరియర్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారట. ఆయా నియోజిక వర్గాలలో ప్రజా వ్యతిరేకత, యాక్టివ్ గా లేని నేతలను పక్కన పెట్టేసి వారి స్థానంలో చురుకుగా ఉండే ప్రాధాన్యం కల్పించేలా బాబు ప్రణాళికలు వేస్తున్నారు. ఇప్పటికే ఆయా నియోజిక వర్గాలలో పార్టీ పరిస్థితికి సంబంధించి ఆ పార్టీ వ్యూహకర్త రాబిన్ శర్మ టిమ్ సర్వే కూడా నిర్వహిస్తోందట. మొత్తానికి అటు జగన్ ఇటు చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రచిస్తోన్న వ్యూహాలు పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

త్రీ క్యాపిటల్స్ స్వలాభమా.. ప్రజా లాభమా!

ఏపీలో కాంగ్రెస్ కు పునర్జీవం !

పని మనిషిపై లోకేశ్ అఘాయిత్యం : విజయసాయి రెడ్డి !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -