Saturday, May 4, 2024
- Advertisement -

కాంగ్రెస్ కే ఎందుకు ఈ అగ్ని పరీక్ష!

- Advertisement -

తెలంగాణలో రోజురోజుకూ కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారుతోంది. గత ఎన్నికలకు ముందు టి‌ఆర్‌ఎస్ కు బలమైన ప్రత్యర్థి పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు ఉనికినే కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఒకవైపు అధికార పార్టీ ప్రభావం మరోవైపు బీజేపీ అత్యంత వేగంగా బలం పెంచుకోవడంతో కాంగ్రెస్ పరిస్థితి మరి దారుణంగా తయారవుతోంది. ఇవే కాక సొంత పార్టీలోని నేతల్లో మెదులుతున్న ముసలం కూడా ఆ పార్టీని మరింత దెబ్బతిస్తున్నాయి. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించడంతో మొదలైన రచ్చ ఇప్పటికీ కూడా నివురుగప్పిన నిప్పుల హస్తం నేతల్లో కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ సిరియర్ నేతలంతా మూకుమ్మడిగా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో ఎవరికివారే యెమున తీరే అన్నట్లుగా తయారైంది హస్తం నేతల పరిస్థితి. .

ఒక్కొక్కరుగా పార్టీకి వీడ్కోలు చెబుతూ ఉండడం, ఉన్న నేతలు కూడా పార్టీ బలోపేతానికి ఏమాత్రం సహకరించకపోవడంతో పార్టీ బలహీన పడుతూ వస్తోంది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న మునుగోడులేని ఆ పార్టీ డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయిందంటే.. హస్తం పార్టీ ఏ స్థాయిలో బలహీన పడిందో అర్థం చేసుకోవచ్చు. దాంతో తిరిగి పార్టీని గాడిలో పెట్టేందుకు రేవంత్ రెడ్డి సీనియర్లను కలుపుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికి.. పెద్దగా ఫలితాలు కనిపించడం లేదు. పార్టీ బలోపేతం కొరకు అందరూ కలిసి కట్టుగా పని చేయాలని వి హనుమంతరావు, జగ్గయ్య వంటి సీనియర్ నాయకులు చెబుతున్నప్పటికి అవి కేవలం నోటి మాటగానే మిగిలిపోతున్నాయి.

ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దాసోజు శ్రవణ్ వంటి సీనియర్ నేతలంతా ఇతర పార్టీల గూటికి చేరారు. ఇప్పుడు తాజాగా ఇటీవల మర్రి శశిదర్ రెడ్డి కూడా కాంగ్రెస్ వీడి బీజేపీ చెంతకు చేరారు. ఇంకొక ఐదుగురు సీనియర్ నేతలు తమతో టచ్ లో ఉన్నారని ఏ క్షణంలోనైనా వారు కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్దంగా ఉన్నారని కమలనాథులు చెబుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ను కలవరపెడుతున్న విషయం ఇదే. ఆ అయిదుగురు ఎవరనే దానిపై ఎలాంటి స్పష్టమైన సమాచారం లేనప్పటికి, అదే గనుక జరిగితే కాంగ్రెస్ క్యాడర్ ఖాళీ అవ్వడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు బయటకు వచ్చిన ప్రతి నేత కూడా రేవంత్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తుండడం గమనార్హం. మరి కాంగ్రెస్ నుంచి పెరుగుతున్న వలసలకు చెక్ పెట్టేందుకు ఆ పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

రాజ్యాంగంపై జగన్ కామెంట్స్.. నెటిజన్స్ ఫైర్ !

మేనిఫెస్టో ఫలితం.. ఎలా ఉంటుందో ?

జగన్ ట్విస్ట్ లు.. బాబు ప్లాన్లు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -