వీరసింహరెడ్డి ఒకే.. మరి వీరయ్య సంగతేంటి?

Balakrishna Veera Simha Reddy Movie Release Date Fix
Balakrishna Veera Simha Reddy Movie Release Date Fix

ఈసారి సంక్రాంతికి టాలీవుడ్ బడా హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి మరియు నటసింహ నందమూరి బాలకృష్ణ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి హీరోలలతో పాటు తమిళ్ స్టార్ హీరో విజయ్ తలపతి కూడా ఈ సంక్రాంతిపై కన్నేశాడు. దీంతో ఈ ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ వార్ కు తెర లేచింది. అయితే ఈ మూడు సినిమాలు సంక్రాంతికి రాబోతున్నాయని చాలా రోజుల క్రితమే ఈ చిత్రాల నిర్మాతలు కన్ఫర్మ్ చేశారు అయితే విడుదల తేదీల విషయంలో ఏ మూవీ కూడా క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా బాలయ్య వీరసింహ రెడ్డి టీం సంక్రాంతి విడుదల తేదీని మొదటగా కన్ఫర్మ్ చేసుకుంది. ఈ మూవీని జనవరి 12న విడుదల చేయబోతున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. .

ఇక మిగిలింది చిరు, విజయ్ మూవీస్ మాత్రమే మిగిలాయి. తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరు ” వాల్తేరు వీరయ్య ” మూవీ జనవరి 11న రిలీజ్ చేసే అవకాశం ఉందట. అయితే ఈ విడుదల తేదీ పై అధికారిక ప్రకటన రానప్పటికి.. దాదాపుగా ఇదే తేదీనే కన్ఫర్మ్ చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇక విజయ్ వారసుడు మూవీ జనవరి 14న రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా 2017 లో చిరు తన 150వ సినిమా ఖైదీ నెంబర్ 150తో మరియు బాలయ్య తన 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి మూవీతో సంక్రాంతి బరిలో నిలిచారు. అప్పుడు ఈ రెండు మూవీస్ కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక మళ్ళీ ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్ హీరోలు వీరసింహరెడ్డి, వాల్తేరు వీరయ్య మూవీస్ తో సంక్రాంతికి తలపడనున్నారు. మరి ఈసారి ఈ ఇద్దరికీ ఎలాంటి విజయం లభిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఆచార్య తెచ్చిన తిప్పలు.. పాపం కొరటాల పరిస్థితి ?

సలార్ లో విజయ్ దేవరకొండ ?

బుచ్చిబాబుకు చరణ్ ఫ్యాన్స్ తో ఇబ్బందే!