Monday, May 6, 2024
- Advertisement -

ఆచార్య తెచ్చిన తిప్పలు.. పాపం కొరటాల పరిస్థితి ?

- Advertisement -

కొరటాల శివ నిన్న మొన్నటి వరకు ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని దర్శకుడిగా రాజమౌళి తరువాతి స్థానంలో ఉన్నాడు. అయితే టైమ్ ఎప్పుడు ఒకేలా ఉండదు అనడానికి కొరటాల ప్రస్తుత పరిస్థితే ఉదాహరణ. ఈయన దర్శకత్వంలో వచ్చిన గత చిత్రం ” ఆచార్య ” ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. మూవీ విడుదలకు ముందు మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రాంచరణ్ లాంటి ఇండస్ట్రీ టాప్ హీరోలతో మల్టీస్టారర్ గా మూవీ తెరకెక్కుతుండడంతో యావత్ సినీ ప్రపంచం అంతా కూడా ” ఆచార్య ” మూవీ కోసం ఎదురు చూశారు. ఇక మెగా అభిమానులైతే తమ అభిమాన హీరోలు ఒకే స్క్రీన్ పై కనిపిస్తుండడంతో మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. .

అందులోనూ కొరటాల శివ దర్శకత్వం కావడంతో మూవీపై అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. కానీ విడుదల తరువాత అందరి అంచనాలు తలకిందులయ్యాయి. అసలు ఇది కొరటాల మూవీనేనా అనే సందేహాలు అందరిలోనూ కలిగాయి. ఇద్దరు టాప్ హీరోలను పెట్టి అసలు కొరటాల మూవీని తెరకెక్కించిన విధానం మెగా అభిమానులకు కూడా నచ్చలేదు. ఇక రిజల్ట్ తరువాత మూవీ ఫ్లాప్ అవ్వడానికి డైరెక్టరే కారణం అనే విధంగా మెగాస్టార్ పరోక్షంగా కొరతలను ఉద్దేశించి అనడంతో ఆ వ్యాఖ్యలు ఆ మద్య బాగా వైరల్ అయ్యాయి. ఇక ఆచార్య ఎఫెక్ట్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేయబోయే మూవీకి సంబంధించి కొరటాల శివపై గట్టిగానే ఒత్తిడి పడింది.

దాదాపుగా ఏడాది క్రితమే ఈ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటికి ఇంతవరకు ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లలేదు. దీనికి కారణం స్క్రిప్ట్ పైన తారక్ కాన్ఫిడెంట్ గా లేకపోవడంతో స్క్రిప్ట్ లో మార్పులు చేయమని తారక్ కొరటాల శివకు సూచించదట. దాంతో ఎన్టీఆర్ కు నచ్చే విధంగా కొరటాల శివ స్క్రిప్ట్ ను తీర్చిదిద్దే పనిలో ఉన్నారని అందుకే మూవీ ఆలస్యం అవుతోందని వార్తలు వచ్చాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో ” జనత గ్యారేజ్ ” మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అయినప్పటికి కొరటాల దర్శకత్వంలో వచ్చిన గత చిత్రం ఆచార్య డిజాస్టర్ తో స్క్రిప్ట్ విషయంలో చాలా పకడ్బందీగా ఉన్నారట ఎన్టీఆర్. మొత్తానికి ఆచార్య ఇచ్చిన ఎఫెక్ట్ తో కొరటాల శివ పరిస్థితి తలకిందులయ్యిందనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి

హర్రర్ మూవీలో ప్రభాస్.. ఓన్లీ తెలుగులోనే!

భారీ బయోపిక్ ను రిజక్ట్ చేసిన మహేశ్..!

పుష్పా2 లో విలన్ గా స్టార్ హీరోయిన్?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -