Monday, April 29, 2024
- Advertisement -

కే‌సి‌ఆర్ చుట్టూ బిగుస్తున్నా ఉచ్చు.. !

- Advertisement -

తెలంగాణలో బీజేపీ టి‌ఆర్‌ఎస్ పార్టీల మద్య జరుగుతోన్న రాజకీయ పోరు.. ఏ స్థాయిలో ఉందో ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఇరు పార్టీలు నువ్వా నేనా అనట్లుగా కయ్యనికి కాలు దువ్వుతున్నాయి. బీజేపీని ఇరుకున పెట్టేందుకు టి‌ఆర్‌ఎస్ ప్లాన్ చేస్తుంటే.. టి‌ఆర్‌ఎస్ ను దెబ్బతీసేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇలా ఈ రెండు పార్టీలు ఒకదానిపై మరోటి పై ఛేయి సాధించేందుకు వ్యూహ రచనా చేస్తూనే ఉన్నాయి. ఆ మద్య ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో కే‌సి‌ఆర్ బీజేపీకి షాక్ ఇస్తే.. తాజాగా లిక్కర్ స్కామ్ లో కే‌సి‌ఆర్ కూతురు కవితా పేరు వచ్చేలా బీజేపీ ప్లాన్ చేసింది. ఇక ప్రస్తుతం కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ లో నిందితురాలిగా ఈడీ కేసులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. .

ఇటీవలే నోటీసులు కూడా జారీ కాగా.. తాజాగా సిబిఐ విచారణ కూడా జరిగింది. ఇక త్వరలోనే కవితా జైలుకు పోవడం ఖాయమని కమలనాథులు గట్టిగా చెబుతున్నారు. అయితే కే‌సి‌ఆర్ కూడా త్వరలోనే ఈడీ కేసులను ఎదుర్కొంటాడని రెడీగా ఉండాలంటూ కాషాయదళం గట్టిగానే హెచ్చరిస్తోంది. అయితే ఈడీలకు బోడి లకు బయపడేది లేదని కే‌సి‌ఆర్ గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికి, ఆయన లోలోపల టెంక్షన్ పడుతున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలోనూ, అలాగే సింగరేణి నిధుల విషయంలోనూ పెద్ద మొత్తంలో కే‌సి‌ఆర్ సర్కార్ అవినీతికి పాల్పడిందనే ఆరోపణలు మొదటి నుంచి వినిపిస్తూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఈడీ ఎంక్వైరీ వేస్తే అవినీతికి సంబంధించిన వాస్తవాలు బయట పడే అవకాశం ఉంది. అందుకే పక్కా ప్రణాళికతో ఈడీ కే‌సి‌ఆర్ పై ప్రయోగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందట. ఎందుకంటే తాజాగా రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే కే‌సి‌ఆర్ చుట్టూ ఉచ్చు బిగించేందుకు బీజేపీ సిద్దమౌతున్నట్లు తెలుస్తోంది. ” రాష్ట్రంలో స్కామ్ ల పాలన జరుగుతోందని, కే‌సి‌ఆర్ ప్రభుత్వం సింగరేణి నిధులను దారి మళ్లించడం వాస్తవం కదా ? ” అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. అంతే కాకుండా టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, కే‌సి‌ఆర్ ప్రజల నుంచి దోచుకున్న సోమ్మంత కక్కిస్తామని, త్వరలో కే‌సి‌ఆర్ ఆయన కుటుంబం జైలుకు పోవడం ఖాయమని ” బండి సంజయ్ వ్యాఖ్యానించారు. దీంతో కే‌సి‌ఆర్ పై కూడా ఈడీ ప్రయోగానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం సిద్దమౌతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. మరి ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను చిత్తు చేయడం కే‌సి‌ఆర్ కు వెన్నతో పెట్టిన విధ్య.. మరి బీజేపీ ప్రయోగిస్తున్న వ్యూహానికి కే‌సి‌ఆర్ ఎలా చెక్ పెడతారో చూడాలి.

ఇవి కూడా చదవండి

కొత్త బిచ్చగాడిలా ఆడుకుంటున్నావా చంద్రన్నయ్య

బాబు, పవన్ ఇద్దరు.. జగన్నే నమ్ముకున్నారా !

చంద్రబాబు స్టైల్ మార్చింది ఆయనే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -