బుచ్చిబాబుకు చరణ్ ఫ్యాన్స్ తో ఇబ్బందే!

Ram Charan Fans Warning to Director Buchi Babu
Ram Charan Fans Warning to Director Buchi Babu

మెగా పవర్ స్టార్ రాంచరణ్, యువ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇక ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ” RC15 ” పూర్తి అయిన వెంటనే బుచ్చిబాబు ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకెళ్లానున్నాడు రాంచరణ్. కాగా ” ఆర్ ఆర్ ఆర్ ” తరువాత చరణ్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో పెరిగింది. దాంతో చరణ్ తరువాతి సినిమాలపై పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన బజ్ ఏర్పడుతోంది. అయితే డైరెక్టర్ శంకర్ విషయానికొస్తే ఆయన సినిమాలకు ఇండియా వైడ్ గా మంచి డిమాండ్ ఉంది. ఇండియాస్ గ్రేట్ ఫిల్మ్ మేకర్స్ లో ఒకరిగా శంకర్ కొనసాగుతున్నారు.

అందువల్ల శంకర్ ప్రాజెక్ట్ పైన భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఇక డైరెక్టర్ శంకర్ మేకింగ్ కూడా అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గదనే చెప్పొచ్చు. అయితే ఇప్పుడు అసలు సమస్య అంతా చరణ్ ఆ తరువాతి సినిమాపైనే. ఎందుకంటే బుచ్చిబాబు ‘ ఉప్పెన ” మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. లవ్ స్టోరీ లో సరికొత్త కోణం చూపిస్తూ మూవీని రూపొందించారు బుచ్చిబాబు. ఇక ఈ మూవీ తరువాత ఎన్టీఆర్ తో మూవీ చేయాలని చాలరోజులు వెయిట్ చేసి.. చివరికి చరణ్ తో మూవీ ఒకే చేశారు బుచ్చిబాబు.

అయితే చరణ్ లాంటి హ్యూజ్ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోను కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న బుచ్చిబాబు ఎలా చూపిస్తాడో అనే ఆందోళన మెగా అభిమానుల్లో వ్యక్తమౌవుతోంది. అందులోనూ ప్రస్తుతం చరణ్ కు పాన్ ఇండియా క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో బుచ్చిబాబు పాన్ ఇండియా స్థాయిలో చరణ్ ప్రాజెక్ట్ ను డీల్ చేయగలడా ? అనే అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి. దీంతో చరణ్ అభిమానులు బుచ్చిబాబుకు స్వీట్ వార్నింగ్ లు కూడా ఇస్తున్నారు. తమ హీరో ఇమేజ్ ను దెబ్బతీసే విధంగా సినిమా తీస్తే సహించబోమని, ఇచ్చిన అవకాశాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకొని బ్లాక్ బస్టర్ ఇవ్వాలని రాంచరణ్ అభిమానులు కోరుతున్నారు. మరి బుచ్చిబాబు చరణ్ తో ఎలాంటి మూవీ తీస్తాడో చూడాలి.

ఇవి కూడా చదవండి

మహేశ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ !

చిరు, బాలయ్య తో భారీ మల్టీ స్టారర్.. బడా ప్రొడ్యూసర్ క్లారిటీ !

లోకేశ్ కోసం తెలుగు హీరోలు వెయిటింగ్!