Friday, June 14, 2024
- Advertisement -

యానిమల్…బర్త్ డే గిఫ్ట్!

- Advertisement -

సందీప్ వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ యానిమల్. డిసెంబర్ 1న సినిమాల విడుదల కానుండగా రణబీర్ సరసన రష్మికా మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో సినిమాల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.

తాజాగా సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. రణబీర్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 28న ఉదయం 10 గంటలకి టీజర్‌ని రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి స్టైలిష్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రీ టీజర్‌తోనే సినిమాపై అంచనాలు పెరిగిపోగా మెయిన్ టీజర్ కోసం అంతా ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు.

ఇక తొలుత ఈ సినిమాని ఆగస్టు 11న విడుదల చేస్తామని ప్రకటించినా తర్వాత రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసి డిసెంబర్‌ 1న విడుదలవుతుందని ప్రకటించారు. అర్జున్ రెడ్డితో సెన్సేషన్ సృష్టించిన సందీప్‌…యానిమల్‌తో ఏం మాయ ఏస్తారో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -