Saturday, May 10, 2025
- Advertisement -

అగ్రహీరోలతో తేజా సజ్జా!

- Advertisement -

ఒకే ఒక్క సినిమా ఆ నటుడి కెరీర్‌నే మార్చేసింది, చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయిన తేజ..లాంగ్ గ్యాప్ తర్వాత హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుండే పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్‌ని షేక్ చేసింది.

ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టగా బాలీవుడ్‌లోనూ రూ.50 కోట్లు వసూలు చేసింది. ఒక సౌత్ సినిమా నార్త్ ఇండియాలో రిలీజ్ అయి రూ. 50 కోట్లు వసూలు చేయడం తక్కువ. అగ్రహీరోల సినిమాలు తప్ప చిన్న సినిమాలు ఈ ఫీట్ సాధించినవి తక్కువే.

ఇప్పటివరకు బాహుబలి 1, బాహుబలి 2, పుష్ప,ఆర్ఆర్ఆర్, రోబో 2, కాంతార, కేజీఎఫ్ 2 ఈ ఫీట్ సాధించగా ఇప్పుడు తేజ సజ్జా హనుమాన్ కూడా చేరింది. దీంతో అగ్రహీరోల సరసన తేజ సజ్జ నిలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఇక హనుమాన్ విడుదలై నెల రోజులు గడుస్తున్న బాక్సాఫీస్ వద్ద వసూళ్ల జోరు కొనసాగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -