టీడీపీ – జనసేన ఫస్ట్ లిస్ట్ రిలీజ్

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీడీపీ – జనసేన ఫస్ట్ లిస్ట్ రిలీస్ అయింది. ఉమ్మడిగా ఫస్ట్ లిస్ట్‌ను రిలీజ్ చేశారు. మొత్తంగా 118 స్థానాలకు ఫస్ట్ లిస్ట్‌లో అభ్యర్థులను ప్రకటించగా టీడీపీ 94,జనసేన 24 మంది అభ్యర్థులు ఉన్నారు.

ఇక పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలకు పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు. అటు బీజేపీ ఆశీస్సులు కూడా టీడీపీ, జనసేనపై ఉన్నాయన్నారు.

మంగళగిరి – నారా లోకేష్,రాజా నగరం -బాలరామకృష్ణ,నెల్లూరు రూరల్ – కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కుప్పం -చంద్రబాబు,రేపల్లే అనగాని సత్యప్రసాద్,బాపట్ల 0 నరేంద్ర వర్మ,సత్తెనపల్లి – కన్నా లక్ష్మీనారాయణ,వినుకొండ-జీవీ ఆంజేనేయులు,తెనాలి-నాదెండ్ల మనోహర్ ఉన్నారు.