Sunday, April 28, 2024
- Advertisement -

బీజేపీ – జనసేన లిస్ట్ ఇదే!

- Advertisement -

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఒకటి, రెండు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించించాయి ప్రధాన పార్టీలు. వైసీపీ సగానికి పైగా అభ్యర్థులను ప్రకటించగా టీడీపీ – జనసేన తొలి జాబితాను విడుదల చేశాయి. ఇక ఇవాళ టీడీపీ రెండో జాబితా విడుదల కానుండగా ఎవరికి ఛాన్స్ దక్కుతుందోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ లిస్ట్‌లో సీనియర్లకు చోటు దక్కుతుందా లేదా కొత్త ముఖాలు ఉంటాయా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది.

ఇక మరోవైపు జనసేన – బీజేపీ అభ్యర్థులు కూడా ఖరారయ్యారు. పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలకు పోటీ చేస్తుండగా బీజేపీ 6 ఎంపీ, 10 అసెంబ్లీ స్థానాల్లో బరిలో నిలవనుంది.

జనసేన ఎంపీ అభ్యర్థులుగా కాకినాడ – పవన్ కల్యాణ్,మచిలీపట్నం – బాలశౌరి ఖరారుకాగా ఎమ్మెల్యే అభ్యర్థులుగా నెల్లిమర్ల – లోకం మాధవి,పాలకొండ – పడాల భూదేవి,అనకాపల్లి – కొణతాల రామకృష్ణ,విశాఖ దక్షిణ – వంశీకృష్ణ యాదవ్,పెందుర్తి – శివశంకర్, పంచకర్ల రమేశ్,యలమంచిలి – సుందరపు విజయ్ కుమార్
,కాకినాడ రూరల్ – పంతం నానాజీ,రాజానగరం – బత్తుల బలరామకృష్ణ,నిడదవోలు – కందుల రమేశ్,పిఠాపురం – పవన్ కల్యాణ్,రామచంద్రపురం – చిక్కాల దొరబాబు,రాజోలు – దేవ వరప్రసాద్ (మాజీ ఐఏఎస్),అమలాపురం – రాజాబాబు,భీమవరం – పులపర్తి రామాంజనేయులు,తాడేపల్లిగూడెం – బొలిశెట్టి శ్రీనివాస్ ,
నరసాపురం – బొమ్మిడి నాయకర్,ఉంగుటూరు – ధర్మరాజు,అవనిగడ్డ – వికృతి శ్రీనివాసరావు,తెనాలి – నాదెండ్ల మనోహర్,దర్శి – గరికపాటి వెంటకరావు,
తిరుపతి – అరణి శ్రీనివాసులు,అనంతపురం అర్బన్ – పెండ్యాల శ్రీలత, మధుసూదన్ రెడ్డి ,మదనపల్లి – రాందాస్ చౌదరి ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక బీజేపీ తరపున బరిలో ఉండే ఎంపీ అభ్యర్థుల విషయానికొస్తే అనకాపల్లి నుండి సీఎం రమేష్, రాజమండ్రి – పురంధేశ్వరి, అరకు – కొత్తపల్లి గీత, నరసాపురం – రఘురామకృష్ణరాజు, రాజంపేట – కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి – రత్నప్రభ(మాజీ ఐఏఎస్), నిహారిక (రత్నప్రభ కుమార్తె), హిందూపురం – సత్యకుమార్ , పరిపూర్ణానంద స్వామి పేర్లు వినిపిస్తున్నాయి.

ఇక బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా విశాఖ నార్త్ – విష్ణుకుమార్ రాజు, పాడేరు – ఉమామహేశ్వరరావు, పి.గన్నవరం – అయ్యాజివేమ, కైకలూరు – కామినేని శ్రీనివాస్
,విజయవాడ వెస్ట్ – గొలగాని రవికృష్ణ, మైలవరం – బాలకోటేశ్వరరావు,గుంటూరు వెస్ట్ – వల్లూరి జయప్రకాశ్ నారాయణ, శ్రీకాళహస్తి – కోలా ఆనంద్, భాను ప్రకాశ్ రెడ్డి, కదిరి – విష్ణువర్దన్ రెడ్డి (బీజేపీ ప్రధాన కార్యదర్శి), ధర్మవరం – వరదాపురం సూరి ,బద్వేల్ – పి.సురేశ్, రాజంపేట – సాయి లోకేశ్ ,జమ్మలమడుగు – ఆదినారాయణ రెడ్డి, కర్నూలు – పార్థసారథి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -