Sunday, May 11, 2025
- Advertisement -

పవన్‌కు షాక్..వైసీపీలోకి జోగయ్య కొడుకు!

- Advertisement -

జనసేన పార్టీ అధినేత, పవన్ కళ్యాణ్‌కు షాక్ తగిలింది. జనసేన పార్టీ నేత హరిరామజోగయ్య కుమారుడు సూర్య ప్రకాశ్ పెద్ద షాకిచ్చారు. ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. సీఎం జగన్ సమక్షంలో సూర్యప్రకాశ్‌ వైసీపీలో చేరనున్నారు. జనసేన పీఏసీ పదవికి రాజీనామా చేశారు.

టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ఆచంట సీటును టీడీపీకి కేటాయించారు. దీంతో అప్పటివరకు జనసేన ఇంఛార్జీగా ఉన్న సూర్యప్రకాశ్ నిరాశ చెందారు. పాలకొల్లు అసెంబ్లీ నియోజవర్గం వైసీపీ ఇన్‌చార్జ్‌గా సూర్యప్రకాశ్‌ను నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

ఇక హరిరామజోగయ్య సైతం పవన్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. తనను పవన్ కోవర్టు అనడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జోగయ్య..జనసేన బాగుకోసం… మా కాపుల ప్రయోజనాలు కాపాడేందుకు నేను ఇస్తున్న సలహాలు మీకు నచ్చినట్లు లేవు. చంద్రబాబే సిఎం .. వేరేవాళ్లకు అవకాశమే లేదు అని లోకేష్ చేసిన ప్రకటనను ఖండించినందుకు నేను వైసిపి కోవర్ట్ నా ? ఆలోచించాలన్నారు. మీకు నచ్చినా లేకున్నా మిమ్మల్ని కాపాడుకోవడం నా విధి….నేను చచ్చే వరకు నా ప్రవర్తన ఇలానే ఉంటుందని తేల్చి చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -