Sunday, April 28, 2024
- Advertisement -

వైసీపీలో చేరికల పర్వం..

- Advertisement -

ఎన్నికల వేళ వైసీపీలో చేరికల పర్వం కొనసాగుతోంది. పులివెందులకు చెందిన టీడీపీ నేత సతీష్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ హరిరామజోగయ్య తనయుడు, జనసేన నేత సూర్యప్రకాశ్ వైసీపీలో చేరారు. వేర్వేరుగా వీరిద్దరూ వైసీపీలో చేరగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు సీఎం జగన్.

పవన్ కళ్యాణ్ ని నమ్మి గతంలో జనసేనలో చేరాను..పవన్ బడుగు, బలహీన వర్గాలకు దగ్గరగా ఉంటారనుకున్నా…ఏ ఆశలతో వెళ్లానో ఆ ఆశలన్నీ నీరు గార్చారు
అని మండిపడ్డారు. పైకి కనిపించే పవన్ వేరు, తెర వెనుక వేరే…ఆరు సంవత్సరాలు పనిచేస్తే ఇప్పటికి అరగంట మాత్రమే నాతో మాట్లాడారు అన్నారు. నేతలకు కూడా పవన్ విలువ ఇవ్వరు…చంద్రబాబునో, లోకేష్‌నో సీఎం చేయటానికే పవన్ పనిచేస్తున్నారు అన్నారు.పార్టీని నమ్ముకున్న వారంతా పవన్ని నమ్మి మోసపోయారు..ఇంట్లోకి కూడా కనీసం ఆహ్వానించరు అన్నారు. సినిమా హాల్లో టికెట్ కొనుక్కున్నట్టు ఇంటి బయట నిలపడాలి…పిఏసీ సభ్యులుగా ఉన్నా కూడా స్వేచ్చగా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ గట్స్ ఉన్న లీడర్…అలాంటి నాయకుని వెనుక నడవాలని అనుకుంటున్నా..
ఏమీ ఆశించకుండా పార్టీలో జాయిన్ అయ్యాను అని తెలిపారు. అవసరం ఉన్నంతసేపు హరిరామజోగయ్యని వాడుకున్నారు…టీడీపీతో పొత్తు పెట్టుకున్నాక జోగయ్యను ఎందుకు వదిలేశారో చెప్పాలన్నారు.

27 సంవత్సరాలుగా నేను టీడీపీ కోసం పని చేశాను…నేను వైఎస్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టినా నన్ను సీఎం జగన్ ఆహ్వానించారన్నారు పులివెందుల టీడీపీ నేత సతీష్ రెడ్డి.నాతో వైసీపి నేతలు టచ్ లోకి వచ్చాక చంద్రబాబు రాయబారం పంపారు…ఇంతకాలం పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు తన స్వార్ధం కోసం మళ్లీ రాయబారం చేశారు అని ఆరోపించారు. చంద్రబాబు నాయకత్వం రోజురోజుకీ దిగజారిపోయింది…ఇప్పుడు టీడీపీలో లోకేష్ పెత్తనమే నడుస్తోందన్నారు. సీనియర్లకు విలువ లేదని..టీడీపీ ఒక వ్యాపార సంస్థగా మారిందన్నారు. జగన్ చూపించిన ఈ ప్రేమ, ఆప్యాయతను ఎప్పటికీ మర్చిపోలేను…అలాంటి మంచి ఫ్యామిలీపై నేను ఎందుకు పోరాటం చేశానా అనిపించింది…జగన్ ఏం చెబితే అదే చేస్తా అని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -