Saturday, May 10, 2025
- Advertisement -

బీఫ్ నిషేధంపై భాజాపాకు సొంత పార్టీ నుంచే వ్య‌తిరేక‌త‌

- Advertisement -
Meghalaya BJP Leader Quits for Beef Party

దేశ‌వ్యాప్తంగా గోవ‌ధ‌పై నిషేధం తీసుకొచ్చిన భాజాపాకు వ్య‌తిరేకంగా తీవ్ర నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.ప్ర‌తిప‌క్ష‌పార్టీల‌నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చినా వాటికి ధీటుగా స‌మాధానాలు చెప్ప‌వ‌చ్చు…. కాని సొంత‌పార్టీనేత‌లే వ్య‌తిరేకంగా విమ‌ర్శ‌లు గుప్పిస్తూ… కస్సుమంటున్న వైనం మాత్రం లేటెస్ట్ అని చెప్పాలి.ఏకంగా త‌న ప‌ద‌వికే రాజీనామ చేయ‌డం ఇప్పుడు భాజాపాలో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

{loadmodule mod_custom,GA1}

తాజాగా ఇప్పుడు మేఘాలయ బిజెపి ముఖ్య నేత బచు మారక్ పార్టీకి రాజీనామా చేసారు. బెర్నార్డ్ మారక్ తర్వాత పార్టీ వీడిన రెండో నేత ఈయన. తమ సామాజిక వర్గానికి బీఫ్ తినడం ఆచారాలు, సాంప్రదాయాల్లో భాగమని పార్టీ కోసం వాటిని తాను పక్కన పెట్టలేనని అందుకే మనసు చంపుకోలేక పార్టీ వీడినట్టు స్పష్టం చేసారు.
బారు సంస్కృతిలో భాగమైన నకం బీచి(బీఫ్)తాము ఎంతో గౌరవంతో తింటామని అలాంటిది ఇది తప్పు అని ఎలా చెప్తారని ప్రశ్నిస్తున్నాడు బచు మారక్. ఇప్పుడు ఈ వివాదం రేగాడానికి బలమైన కారణం ఉంది. మోడీ మూడేళ్ళ పాలన పూర్తైన సందర్భంగా బచు మారక్ తన సన్నిహితులకు బీర్ అండ్ బీఫ్ పార్టీ ఆఫర్ చేయటమే కాకుండా ఏకంగా తన ఫేస్ బుక్ పేజి లో పోస్ట్ చేసాడు. విషయం తెలిసిన అధిష్టానం చివాట్లు పెట్టింది.

{loadmodule mod_custom,GA2}

2018లో మేఘాలయలో బీజేపీ పవర్ లోకి వస్తే బీఫ్ మీద నిషేధం ఉండదని.. సాధారణ ధరలకే బీఫ్ అందరికి అందేలా చూడటమే తమ విధిగా బాచు మారక్ బీఫ్ నిషేధానికి వ్యతిరేకంగా ప్రచారం చేపట్టటం బీజేపీలో ఇప్పుడు కలకలం రేపుతోంది. విపక్షాలు విరుచుకుపడటం తర్వాత.. సొంత పార్టీ నేతలే బీజేపీ చేపట్టిన బీఫ్ నిషేధానికి వ్యతిరేకంగా గళం విప్పటం ఆసక్తికరంగా మారింది.

{loadmodule mod_sp_social,Follow Us}

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -