ఆడ‌పిల్ల‌కి జ‌న్మ‌నిచ్చిన న‌టి మ‌నాలీ రాథోడ్

- Advertisement -

‘గ్రీన్ సిగ్నల్’, ‘ఓ స్త్రీ రేపు రా’, ‘నేను లోకల్‌’, ‘ఫ్యాషన్‌ డిజైనర్‌’, ‘హౌరా బ్రిడ్జ్‌’, ‘ఎంఎల్‌ఏ’ వంటి చిత్రాల ద్వారా సిల్వర్‌ స్ర్కీన్‌పై మెరిసిన హైదరాబాదీ అమ్మాయి మనాలీ రాథోడ్‌. ఈమె పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే! ఏజీ కాలనీలో ఆమె ప్రాథమిక విద్య సాగింది. ఎస్‌ఆర్‌ నగర్‌లో ఇంటర్‌.. సీఎంఆర్‌ కాలేజీలో ఇంజినీరింగ్‌ పూర్తిచేసింది. ఈ పక్కా హైదరాబాదీ అమ్మాయి పండంటి ఆడ‌పిల్ల‌కి జ‌న్మ‌నిచ్చింది.

2019 నవంబర్‌లో బీజేపీ నాయకుడు విజిత్ వ‌ర్మ‌ను వివాహం చేసుకుంది. వీరిది పెద్దలు కుదర్చిన ప్రేమ వివాహం. ఆ మ‌ధ్య కాలంలో మ‌నాలీ ప్రెగ్నెంట్ గా ఉన్న పొటోలు సోష‌ల్ మీడియాలో సంద‌డి చేశాయి. కాగా మ‌నాలీ పండంటి ఆడ‌పిల్ల‌కి జ‌న్మ‌నిచ్చింది మ‌నాలీ రాథోడ్..జూలై 18న పాప‌కి జ‌న్మ‌నివ్వ‌గా ..ఈ విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. దాంతో మ‌నాలీకి అంద‌రూ కంగ్రాట్స్ తెలియ‌జేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -