Friday, March 29, 2024
- Advertisement -

మోత్కుపల్లి ఆరోగ్యం సీరియస్.. రాష్ట్రం కుడా సీరియస్..!

- Advertisement -

బిజేపి నేత మోత్కుపల్లి ఆరోగ్యం క్షీణించినట్లు యశోద ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కరోనాతో మోత్కుపల్లి హైదరాబాద్​ సోమాజిగూడలో యశోద ఆస్పత్రిలో చేరారు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆయన ఆరోగ్యం శనివారం రాత్రి క్షీణించడం వల్ల ఐసీయూకి తరలించారు. ప్రస్తుతం మోత్కుపల్లి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తున్నారు.

రాష్ట్రంలో కరోనా కేసులు రోజుకో రికార్డు సృష్టిస్తున్నాయి. ఇవాళ ఏకంగా ఐదు వేల కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 5వేల 93 కరోనా కేసులు నమోదైనట్టు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అటు మరణాలు సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. నిన్న ఒక్క రోజే 15 మంది కొవిడ్‌-19కు బలయ్యారు.

మరోవైపు మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 37 వేలు దాటింది.జీహెచ్​ఎంసీ పరిధిలో 743 కరోనా కేసులు కేసులు వెలుగు చూడగా… మేడ్చల్‌ జిల్లాలో 488, రంగారెడ్డి జిల్లాలో 407 కరోనా కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్‌లో 367, సంగారెడ్డిలో 232, కామారెడ్డిలో 232, జగిత్యాల జిల్లాలో 223 కరోనా కేసులు వచ్చాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో 175, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 168 కేసులు నమోదైనట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది.

అంతా అబద్ధం.. నేను చెప్పింది నమ్మండి అంటున్న ఈటల..!

120 కూల్చివేశారు.. ఎక్కడో తెలుసా.. చిన బాబు చెప్పారు..!

కరోనా వచ్చాక పవన్ కళ్యాణ్ సూక్తులు విన్నారా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -