గాడిదలరేటు మహాఉంటె వేలు ఉంటాయి.కాని ఓగాడిద రేటు వింటె ముక్కున వేలువేసుకోకమానరు.అది అట్లాంటి ఇట్లాంటి గాడిద కాదండోయ్..దాని రూటె స్పెషల్. ఈగాడిద పేరు టిప్పు.కాదు. గుర్రంలా ఒడ్డూ పొడువున్న టిప్పు ధర పది లక్షల రూపాయలట.
మామూలు గాడిద లక్ష రూపాయల వరకుంటే దీని ధర అంతకు పదింతలు.
{loadmodule mod_custom,Side Ad 1}
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ గాడిదల వ్యాపారి ఐదు లక్షల రూపాయలకు కొంటా అంటే కూడా ఇవ్వలేదని, పది లక్షలకైతేనే అమ్ముతానని హర్యానాలోని సోనాపేట్ జిల్లాకు చెందిన గాడిద యజమాని రాజ్ సింగ్ చెబుతున్నారు.ఈ గాడిదకు రోజుకు ఐదు కిలోల మినుములు, నాలుగు లీటర్ల పాలు, 20 కిలోల పచ్చిగడ్డి ఆహారం. అందుకు రోజుకు వెయ్యి రూపాయలు ఖర్చవుతుందట. చుట్టుపక్కల ఇలాంటి గాడిదే లేదంటారు.
Also read
