Thursday, May 9, 2024
- Advertisement -

కళ్యాణ్ రామ్ కి చెల్లిగా మారిన లాస్య

- Advertisement -
anchor lasya play kalyan rams sister

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తాజా సినిమా ఎమ్మెల్యే (మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి). ఈ మూవీతో ఉపేంద్ర మాధవ్ దర్శకుడుగా మారాబోతున్నాడు. ఇకపోతే,  ఈ పొలిటికల్ కామెడీ ఎంటర్టైనర్ లో ముందుగా కళ్యాణ్ రామ్ సరసన.. మనాలి రాథోడ్ హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ చివరి నిమిషంలో.. ఆమెను తప్పించి కాజల్ ను ఓకే చేశారు.

{loadmodule mod_custom,GA1} 

అయితే ఇప్పుడు ఈ సినిమాలో కీలకమైన హీరో చెల్లెలి పాత్ర కోసం యాంకర్ లాస్యను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య ఉన్న అన్న చెల్లెలు బంధంను.. ఈ సినిమాలో బాగా చూపించబోతున్నారట. బుల్లితెర నుంచి వెండితెరకు వస్తోన్న మిగతా హాట్ యాంకర్స్ లా కాకుండా లాస్య మామూలుగానే సత్తా చాటడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసే ఉంటుంది. ఈ నెపథ్యంలో.. చిన్నాచితకా అవకాశాలను మాత్రమే అందుకుంటున్న యాంకర్ లాస్య.. ప్రస్తుతం ‘రాజా మీరు కేక’ అనే సినిమాలో కీలక పాత్రలో నటించి రిలీజ్ కు రెడీ అయింది. ఈ మూవీలో దాదాపుగా హీరోయిన్ రోల్ చేసిన లాస్య.. ఇప్పుడు తన సిల్వర్ స్క్రీన్ కెరీర్ పై సీరియస్ గానే దృష్టి పెట్టిందట.

{loadmodule mod_custom,GA2}

అయితే, కొన్ని హద్దులు పెట్టుకోవడంతో అమ్మడు టాలెంటెడ్ అయినా.. ఛాన్సులు పెద్దగా రావడం లేదట. చివరగా ఇప్పుడు సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీగా ఉన్న కళ్యాణ్ రామ్ సినిమాలో హీరో చెల్లెలి పాత్ర రావడంతో.. లాస్య వెంటనే ఓకే చెప్పేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ మూవీలో.. హీరో చెల్లెలి పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుందని, ఆ పాత్రకు లాస్య కరెక్ట్ గా సరిపోతుందని ప్రచారం చేస్తున్నారు. మరి యాంకర్ గా మంచి పేరునే సంపాధించుకున్న లాస్య.. ఇప్పుడు నందమూరి హీరో చెల్లెలిగా ఎలా మెప్పిస్తుందో చూడాలి. 

{youtube}TSR0OThMaRQ{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ఆ యాంకర్స్ చేసిన తప్పు నేను చేయను – లాస్య
  2. పళ్లు రాలిపోయేలా కొట్టాలి.. రవిపై లాస్యకు ఇంత కోపం ఉందా..?
  3. యాంకర్ లాస్య తల్లి కాబోతుంది..?
  4. యాంకర్ లాస్య గురించి ఎవరికి తెలియని సీక్రెట్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -