Sunday, May 19, 2024
- Advertisement -

లైంగిక కోర్కెలను పెంచే ఔష‌ధం…కిలో రూ.60 ల‌క్ష‌లు

- Advertisement -
Yarsa gumba King of himalaya Viagra

యార్సాగుంబా పేరు ఏంటి విచ‌త్రంగా ఉంద‌నుకుంటున్నారా…ఇది ఓర‌క‌మైన వ‌న‌మూలిక‌. పేదరికంలో మగ్గుతున్న ఎంతోమంది నేపాలీలకు ఈవ‌న మూలిక సేక‌ర‌న అదొక ఉపాధి మార్గం. ప్రాణాలకు తెగించి మరీ హిమాలయ పర్వతాల మీద దానికోసం అన్వేషిస్తారు. నెలరోజులు పాటు జరిగే దీని అన్వేషణ పైనే.. ఆ తర్వాత వీరి కుటుంబ పోషణ ఆధారపడి ఉంటుంది.

చాలా విలువైన మూలికలు కావడంతో వీటి కోసం ప్రాణాలకు తెగించి మరీ ఈ కుటుంబాలు పోరాడుతున్నాయి.దీని విలువ ల‌క్ష‌ల్లో ఉంటుంది. ఎందుకు వీటికి ఇంత విలువ‌..? ఎందుకు ప‌నికి వ‌స్తాయి అనుకుంటున్నారా ..అయితే కింద చ‌ద‌వండం..
యార్సాగుంబాను కింగ్ ఆఫ్ హిమాల‌యా వ‌యాగ్ర అంటారు.లైంగిక కోర్కెలకు ఉత్ప్రేరకంగా ఈ యార్సాగుంబా పనిచేస్తుంది. దీన్నే హిమాలయన్ వయాగ్రా అని కూడా అంటారు.వేసవి ప్రారంభంలో మంచు కరగడం మొదలైన నాటి నుంచి వీటి కోసం నేపాలీల అన్వేషణ సాగుతుంది.బంగారంకంటె విలువైన‌దిగా మారడంతో ప్రాణాల‌కు తెగించి మూలిక‌కోసం అన్వేష‌న కొన‌సాగిస్తారు. మార్కెట్లో యార్సాగుంబాకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో.. నేపాలీలు దీన్నో ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు.ఒక కిలో యార్సాగుంబా ధర రూ.60 లక్షల(లక్ష డాలర్ల) పైమాటే ఉంటుంది.అందుకే దానికి అంత డిమాండ్‌.

{loadmodule mod_custom,Side Ad 1}

గొంగళిపురుగు లాంటి ఓ పురుగు లార్వా తలపై పుట్టగొడుగుల మాదిరిగా పెరిగే ఫంగస్సే ఈ యార్సాగుంబా. శీతాకాలంలో యార్సాగుంబా పురుగులా ఉంటే.. వేసవి వచ్చేసరికి ఫంగస్‌ కారణంగా చిన్న మొక్క మాదిరిగా మారిపోతుంది. పూర్తిగా తయారైన యార్సాగుంబా ఒక అగ్గిపుల్ల మాదిరిగా.. రెండు నుంచి మూడు సెంటీమీటర్ల పొడుగు ఉంటుంది.పసుపు పచ్చ రంగులో ఉండే యార్సాగుంబా బురదలో పెరుగుతుంది. లైంగిక కోర్కెలను రేకెత్తించడంలో ఉపకరిస్తుంది. అంతేకాదు చాలా రకాల జబ్బులకు కూడా ఈ మూలికను ఉపయోగపడుతుంది.
వెయ్యేళ్ల క్రితం పశుపోషకులు యార్సాగుంబాను గుర్తించారు. దీనిని పశువులకు దాణాగా ఉపయోగించే వారు. వీటిని తిన్న తర్వాత పశువులు చాలా చురుకుగా మారిపోయేవి. దీంతో ఈ మూలికల్లో ప్రత్యేకత ఉందని గుర్తించారుఓ చైనీస్‌ రన్నర్‌ దీనిని తిని రెండు ప్రపంచ రికార్డులను బద్ధలు కొట్టడంతో 1990ల్లో దీనికి ప్రపంచ గుర్తింపు లభించింది.

{loadmodule mod_custom,Side Ad 2}

ప్రస్తుతం చైనా ఔషధ పరిశోధకులు దీనిని లైంగిక కోరికలు పెంచే.. మూల‌కంగా ఉప‌యేగిస్తున్నారు.జాయింట్‌ పెయిన్స్‌ను తగ్గిస్తుందని, ఊబకా యం, కేన్సర్‌కు ఉపయోగపడుతుందని చెపుతున్నారు. యార్సాగుంబాకు ఉన్న వైద్య విలువపై హైప్‌ కారణంగా ఇటీవల డిమాండ్‌ పెరిగింది. ఈ ఉత్పత్తుల కోసం జనం ఎగబడుతున్నారు. దీంతో 2009–2011 తర్వాత యార్సాగుంబా ఉత్పత్తి సగానికిపైగా పడిపోయింది. సరైన నియంత్రణ లేకపోవడం, వాతావరణ మార్పులు, ఉత్పత్తికి మించి డిమాండే దీనికి కారణం.

Also read

  1. ఆమె వయసు 70 ఏళ్లు.. అందం 20 ఏళ్లు
  2. ఒక మగడు.. మరో మగవాడి వల్ల గర్భం దాల్చాడు
  3. ద‌ర్జాగా దందాను కొన‌సాగిస్తున్న వాన‌ర స‌మూహాలు
  4. నిద్ర‌మాత్ర‌లు వాడుతున్నారా….అయితే మీప‌ని గోవిందా…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -