Monday, May 20, 2024
- Advertisement -

బొప్పాయి గింజలు తినండి..ఆరోగ్యంగా ఉండండి

- Advertisement -

బొప్పాయి … పోషకాల గని. శరీరానికి అవసరమైన అన్నీ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బొప్పాయి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బొప్పాయి తెల్లని గుజ్జు ముఖానికి రాసుకోవడం వల్ల మంచి కళ వస్తుంది.మొటిమలు కూడా తగ్గుతాయి. ఆస్తమా ,కీళ్ళవ్యాధులు వంటివి రాకుండా చేస్తుంది. మలబద్దకానికి బొప్పాయి ఒక మంచి ఔషధంలా పని చేస్తుంది.

అయితే చాలామంది బొప్పాయి గింజలను విషంగా భావించి తీసుకొరు. కానీ బొప్పాయి పండుతో పోల్చితే విత్తనాల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి గింజలతో జీర్ణక్రియ మెరుగుపడటమే కాదు మలబద్దకాన్ని నివారిస్తాయి. ఫైబర్ కంటెంట్ జీర్ణవ్యవస్థను నియంత్రించడంలో సహాయపడుతుంది.

బొప్పాయి గింజలలోని పాపైన్ మరియు కార్పైన్ వంటి ఎంజైములు సహజ యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను అందిస్తాయి.ఈ గింజలను తీసుకోవడం వల్ల హానికరమైన వ్యాధికారక క్రిములను ఎదుర్కోవడానికి మరియు ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. తేనెతో కలిపి బొప్పాయి గింజలను తింటే మంచి ఫలితం ఉంటుంది. బొప్పాయి గింజల పేస్ట్ ను చర్మంపై రాసుకోవడం ద్వారా చర్మం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -