Sunday, June 2, 2024
- Advertisement -

సుమంత్ అశ్విన్‌ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసా ?

- Advertisement -
Young Hero Sumanth Career In Danger

ఎమ్మెస్ రాజు.. ఒక్కప్పుడు ఎన్నో హిట్స్ సినిమాలను తీసాడు. ఒక్కడు.. మనసంతా నువ్వే.. వర్షం.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి చిత్రాలతో.. నిర్మాతగా తిరుగులేని స్థాయిని అందుకున్నాడు ఎమ్మెస్ రాజు. మహేష్, ప్రభాస్ లకే కాకుండా.. ఉదయ్ కిరణ్, సిద్దార్థ్ లాంటి హీరోలుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఎమ్మెస్ రాజు నిర్మించిన సినిమాల ద్వారానే.

{loadmodule mod_custom,GA1} 

అలా అంతమంది హీరోలకు లైఫ్ ఇచ్చిన రాజు.. తన కొడుకు సుమంత్ అశ్విన్‌ను మాత్రం సక్సెస్ ఫుల్ హీరోగా నిలబెట్టలేకపోయాడు. ఆయన దర్శకత్వంలో కొడుకును హీరోగా పరిచయం చేస్తూ తీసిన ‘తూనీగ తూనీగ’ పెద్ద ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత ‘అంతకుముందు ఆ తరువాత’ అనే సినిమాతో విజయం అందుకొని.. ‘కేరింత’ సినిమాతో పర్వాలేదనిపించాడు. ఈ రెండు సినిమాల పక్కన పెడితే.. మిగిత ఏ సినిమాలు ఈ హీరోకి సక్సెస్ ను ఇవ్వలేకపోయాయి. తాజాగా సీనియర్ దర్శకుడు వంశీతో చేసిన ‘ఫ్యాషన్ డిజైనర్’ మీద అశ్విన్ చాలా ఆశలే పెట్టుకున్నాడు కానీ.. ఆ సినిమా దారుణమైన అనుభవాన్ని మిగిల్చింది. వంశీ సినిమా కావడం, ‘లేడీస్ డైరెక్టర్’కు సీక్వెల్‌గా తెరకెక్కడం.. ప్రమోషన్ అదీ గట్టిగా చేయడంతో ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని కొంత వరకు ఆకర్షించింది కానీ.. సినిమా చెత్తగా ఉండటంతో ఫలితం నిరాశాజనకంగానే వచ్చింది.

{loadmodule mod_custom,GA2} 

ఈ సినిమాలో సుమంత్ అశ్విన్ పెర్ఫామెన్స్ మీద విమర్శలు వ్యక్తమయ్యాయి. అసలే కుర్రాడికి హీరోగా ఎలాంటి ఇమేజ్ లేదు.. పైగా వరుస ఫెయిల్యూర్లు.. దీంతో అతడి కెరీర్ ప్రమాదకర స్థితికి చేరుకుంది. సుమంత్ చేతిలో ఇప్పుడు సినిమాలేవీ లేవు. ‘ఎందుకిలా’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. దానికి మంచి స్పందనే వస్తున్న క్రమంలో కుర్రాడి మున్ముందు వెబ్ సిరీస్‌కే పరిమితం అయిపోతాడేమో అన్న కామెంట్లు వస్తున్నాయి.

{youtube}RP0b7l2qQEs{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ఖడ్గం హీరోయిన్ కి.. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందో తెలుసా..?
  2. సునీల్ కు ఎలాంటి పరిస్థితి వచ్చిందో తెలుసా..?
  3. దారుణంగా మారిన శ్రీను వైట్ల పరిస్థితి.. కనిసం ఎవ్వరూ మాట్లాడటం లేదట..
  4. యాంకర్ రవి పరిస్థితి.. ఏంత దారుణంగా అయిందో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -