తెలుగులో సునీల్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. టాప్ కమెడియన్ గా సునీల్ చేసిన కామెడీ గురించి అందరికి తెలిసిందే. సునీల్ కాల్షీట్లు దొరకడమే గగనం అనే పరిస్థితి ఉండేది. సునీల్, మాటల మాంత్రికుడు, టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే.
{loadmodule mod_custom,GA1}
కలిసి చదువుకున్న వీరిద్దరు ఇండస్ట్రీలోకి రాకముందు ప్రాణ స్నేహితులు. ఆ తర్వాత కమెడియన్ నుంచి సునీల్ హీరో అయ్యాక సునీల్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో చాలా సినిమాలు వస్తాయని చాలా రూమర్స్ వచ్చాయి.. కానీ అందులో ఒక్కటి కూడా నిజం అవ్వలేదు. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమాల్లో సైతం సునీల్ కనపడడం మానేశాడు. గతంలో త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమాలు చేసేందుకు సునీల్ చాలా సార్లు ట్రై చేసినా అవి ఫెయిల్ అయ్యాయి. ఇక ఇప్పుడు త్రివిక్రమ్.. పవన్‌కళ్యాణ్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సీనియర్ హీరో వెంకటేష్ ఓ క్యామియో రోల్ చేస్తున్నారు. వెంకటేష్ ఐదు నిమిషాల పాటు తెరమీద నానా హంగామా చేసి ప్రేక్షకులను నవ్వించి వెళ్లిపోతాడట. ఈ రోల్ గురించి తెలుసుకున్న సునీల్ ఈ రోల్ తనకు ఇవ్వాలని త్రివిక్రమ్‌ను కోరినా అందుకు త్రివిక్రమ్ అంగీకరించలేదట.
{loadmodule mod_custom,GA2}
ఆ పాత్రకు వెంకటేష్‌ను తీసుకోవాలని తాము డిసైడ్ అయిపోయామని.. ఇప్పుడు ఆయన్ను మార్చడం కుదరదని సునీల్ కు ఖరాకండీగా చెప్పేశాడట త్రివిక్రమ్. దీంతో సునీల్ కాస్త డిజప్పాయింట్ అవ్వగా, తన నెక్ట్స్ సినిమాలో మరో మంచి రోల్ ఇస్తానని త్రివిక్రమ్ కాస్త సముదాయించినట్టు తెలుస్తోంది.
{youtube}ZY6fjPVlJrU{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related