Monday, April 29, 2024
- Advertisement -

సునీల్‌ మీద ఘోరంగా కుట్ర జరుగుతోంది?

- Advertisement -
producer conspiracy on sunil

సునీల్‌ గత కొంత కాలంగా సరైన హిట్ లేక బాధపడుతున్నాడు. అయితే సునీల్‌ను ఓ బడా నిర్మాత తొక్కేస్తున్నార‌ని వార్తలు సోష‌ల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఓ నిర్మాత సునీల్ పై కక్ష కట్టారని పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి. సునీల్ న‌టించిన జక్కన్న మూవీ అబౌవ్ ఏవరేజ్ సినిమా అనిపించుకున్నా శాటిలైట్ హ‌క్కులు అమ్ముడు కాలేదు. జ‌క్క‌న్న త‌ర్వాత సునీల్ న‌టించిన వీడు గోల్డ్ ఎహే సినిమా కూడా రిలీజ్ అయ్యింది. జ‌క్క‌న్న నిర్మాత ఏదో కిందా మీదా పడి ఓ ఛానెల్ దగ్గర కొంత మొత్తానికి శాటిలైట్ రైట్స్ డీల్ కుదుర్చుకున్నాడ‌ట‌.

ఫైల్ అంతా మూవ్ అయింది. తెల్లవారితే చేతికి చెక్ వస్తుంది అనుకున్నస‌మ‌యంలో… ఏం జరిగిందో తెలియ‌దు కానీ సారీ చెప్పేశారట. అయితే దీని వెనుక ఓ నిర్మాత హ‌స్తం ఉంద‌ని, సునీల్ సినిమాను కొనవద్దని ఆ ఛానెల్ వారికి ఆ నిర్మాత చెప్పార‌ని టాక్ వినిపిస్తోంది. అదే విధంగా కృష్ణాష్టమి, జక్కన్న, ఈడు గోల్డ్ ఎహే సినిమాల ప్రచారం సందర్భంగా కూడా కొన్ని చానెళ్లకు, ఎఫ్ఎమ్ లకు కూడా ఓ నిర్మాత ఫోన్లు చేసి, వాటికి మరీ ఎక్కువ ప్రచారం ఇవ్వవద్దని చెప్పిన‌ట్టు ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ టాక్‌.

ఈ విష‌యాల‌న్నీ వాస్తవమే అని ఆయా ఛానెళ్ల లో చేసే జనాలు చెబుతున్నా…ఆ నిర్మాత పేరు మాత్రం చెప్పడం లేదు. సునీల్ మీద ఇంతగా ప‌గ‌బ‌ట్టే శ‌త్రువుగా కొన‌సాగాల్సిన అవ‌స‌రం ఏ నిర్మాతకు వుంటుంది ? పైగా ఛానెళ్లను, మీడియాను కూడా ప్రభావితం చేయగల ఆ నిర్మాత ఎవ‌రా అని ఇండ‌స్ట్రీలో ఒక్క‌టే చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

Related

  1. అలాంటి షకీలా.. ఇలా అయ్యిందేంటి?
  2. సుడిగాలి సుధీర్ కు ఝులక్ ఇచ్చిన రోజా!
  3. ఉపాసనను కష్టపెడుతున్న రామ్ చరణ్
  4. యాంకర్ అనసూయ లవ్ స్టోరి ఇదే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -